చెప్పులు కుట్టిన చేతులకు
తప్పెట దరువుల మోతలకు
దండోరా దరువుల గుండె
చప్పుడుకు దండం పెడుతున్నా..
సచ్చిన పసుల చర్మాన్ని ఒలిచి
చెప్పులు కుట్టి తప్పెట కట్టీ
బాయిల నీళ్లు బయటికి రానీకి
బొక్కెన కుట్టిన చేతులకూ "చెప్పు"
కురుమూర్తి రాయకు ఉద్దాలు కుట్టింది
ఆదిగలే మహా మాదిగలే..
కిరుకిరు చెప్పులు కుట్టీన చేతులు
ఈ దేశాన్ని ఏలిన రారాజులే "చెప్పు "
ఆర్కల రాజేష్
91779 09700