కరుణ కిరణాలు

poem

Update: 2023-06-18 18:30 GMT

నాన్న

నీవు ప్రభాతమై

పలకరించినా

నాన్న

నీవు పచ్చదనమై

పులకింపచేసినా

నాన్న

వర్షంలా గుండెను

ఆనందిప చేసినా

నీవు లేని

నేను ఒంటరినే

నీ శ్వాస తగలని

ఈ జీవితం అనాధయే

నీ చేయి

అందని బ్రతుకు బరువే

నీ మాట వినని

హృదయం కన్నీటి ప్రవాహమే

నీవు అరుణోదయంలా

కరుణ కిరణాలు

పంపుతుంటే

నేను నీ ధర్మాన్ని

పాఠిస్తున్నా....ఈభువిన

డా.బాలాజీ దీక్షితులు పి.వి

88853 91722

Tags:    

Similar News

రూపకం