ప్రకృతి

poem

Update: 2023-06-18 18:30 GMT

ఈ ప్రపంచంలో ప్రతి జీవిపై

పెత్తనం చెలాయిస్తాం

మన స్వార్థం కోసం

వన సంపదను సంహరిస్తాం..

కాలుష్యాన్నీ పెంచుతూ

జీవజాతులను నాశనం చేస్తున్నాం మనం..!

దాహంతో బిక్కుమంటున్న

మూగజీవుల అరణ్యరోదన

ప్రజల ఆక్రందన పెడచెవిన

పెడుతున్నాము మనం..!

సెల్ టవర్స్‌ని ప్రేమిస్తూ

కోయిల మధురగానం,

కువకువల సందడి

నాశనం చేస్తున్నాము మనం..!

టెక్నాలజీ పేరుతో

యాంత్రిక వ్యవసాయం చేస్తూ

ఆవుల గంజరం ఉనికే లేకుండా

చేస్తున్నాం మనం..!

అన్నింటిని నాశనం చేస్తున్నాము మనం

కానీ... ఏదో ఒక రోజు

ఉపద్రవం ముంచుకురాక తప్పదు

ప్రకృతి చేతిలో మమ అనకా తప్పదు..

అందుకే.. పకృతిని కాపాడుకుందాం...

భావితరాలకు వారసత్వంగా

అందించుకుందాం.

మంజుల పత్తిపాటి

93470 42218

Tags:    

Similar News

రూపకం