వారం వారం మంచి పద్యం: రహస్యం

poem

Update: 2023-06-18 18:45 GMT

ఈ కాలంలో పోస్ట్ కార్డ్ రాసిందెవరబ్బా! అనుకున్నాను. రెండువైపులా ముత్యాల వరుసను మరిపించేలా ఉన్న రాతను చూసి ముచ్చట పడ్డాను. చదవడం ప్రారంభించాను. ‘అడవిలో వెళుతున్న ఒక సింహం కప్ప అరుపు విని అదొక పెద్ద జంతువుగా భావించి అక్కడ ఆగి సింహనాదం చేసింది. అది విని కప్ప కొలను నుండి బయటకు వచ్చింది. కప్పను చూసిన సింహం ఇంత చిన్న జంతువుకు అంత పెద్ద గొంతా అని పాదంతో తొక్కింది.‘ కోడి పెట్ట కోసం రెండు పుంజులు కొట్టాడుకున్నాయి. ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాక్కొంది. గెలిచిన పుంజు గర్వంతో ఇల్లెక్కి బిగ్గరగా కూసింది. ఆకాశంలో వెళుతున్న రాబందు అది విని కిందికి దిగి కాళ్ళతో పుంజును ఎగరేసుకెళ్ళింది.

‘ఆరుబయట దారిపైన రంగురంగుల కోడి పురుగుల్ని ఏరుకుని తింటుంది. దగ్గర్లోనే ఉన్న కుక్క, కోడి మెడ పట్టుకుని ఉరికింది. అది గమనించిన కోడి గాల్లోకి ఎగిరి దూరంగా వెళ్ళింది. దాన్ని వెంటాడుతూ కుక్క పరిగెత్తి తుదకు పట్టుకుంది. అది చూసిన మనిషి కుక్కపైకి రాయి విసిరాడు’. ‘నేను చదివినవి, చూసినవి నీ ముందుంచాను, వాటిలోని రహస్యం విప్పగలవా?’

బలము కలిగిన జీవులు బలము చూపి

అప్ప ప్రాణుల జంపును అహము దీర

సృష్టి రహస్య మిదెనోయి సృజన శీలి

కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము.

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Tags:    

Similar News

రూపకం