అంగారకుడిపై హార్ట్ బీట్ సౌండ్స్
దిశ, ఫీచర్స్ : మార్స్ (అంగారకుడి)పై జీవాన్వేషణకు నాసా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్ తన పరిశోధన కొనసాగిస్తోంది. ఇటీవలే నాలుగు మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి కుజుడి క్లియర్ ఫొటోలు పంపిన రోవర్.. తొలిసారిగా రెడ్ ప్లానెట్‌పై వినిపిస్తున్న శబ్దాలను రికార్డు చేసి నాసాకు పంపింది. ఈ ఆడియో ద్వారా సైంటిస్టులు అక్కడ ఏ స్థాయిలో గాలులు వీస్తాయనే విషయాన్ని అంచనా వేయనున్నారు. ఈ ఆడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన నాసా.. మైక్రోఫోన్‌లో రికార్డ్ అయిన […]
దిశ, ఫీచర్స్ : మార్స్ (అంగారకుడి)పై జీవాన్వేషణకు నాసా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్ తన పరిశోధన కొనసాగిస్తోంది. ఇటీవలే నాలుగు మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి కుజుడి క్లియర్ ఫొటోలు పంపిన రోవర్.. తొలిసారిగా రెడ్ ప్లానెట్‌పై వినిపిస్తున్న శబ్దాలను రికార్డు చేసి నాసాకు పంపింది. ఈ ఆడియో ద్వారా సైంటిస్టులు అక్కడ ఏ స్థాయిలో గాలులు వీస్తాయనే విషయాన్ని అంచనా వేయనున్నారు. ఈ ఆడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన నాసా.. మైక్రోఫోన్‌లో రికార్డ్ అయిన విభిన్న తీవ్రతలతో కూడిన శబ్దాల ద్వారా అక్కడ రాతి శిలలు ఉన్నట్లు భావిస్తోంది. హ్యుమన్ హార్ట్ బీట్, లేజర్ స్ట్రెయిక్ సౌండ్స్ తరహాలో వినబడుతున్న ఈ శబ్దాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/NASAPersevere/status/1369696414456893442?s=20