వేద కృష్ణమూర్తితో బీసీసీఐ సరిగా వ్యవహరించలేదు : లీసా

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులను కరోనా కారణంగా కోల్పోయి బాధల్లో ఉంటే.. ఆమె పట్ల బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని ప్రముఖ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ లిసా స్టాలేకర్ అన్నారు. వేదా జీవితంలో కరోనా పెను విషాదాన్ని నింపింది. రెండు వారాల వ్యవధిలో అక్క, తల్లిని వేదా కోల్పోయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యింది. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు సహచరులు కూడా వేదాను ఓదార్చారు. కాగా […]

Update: 2021-05-15 09:10 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులను కరోనా కారణంగా కోల్పోయి బాధల్లో ఉంటే.. ఆమె పట్ల బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని ప్రముఖ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ లిసా స్టాలేకర్ అన్నారు. వేదా జీవితంలో కరోనా పెను విషాదాన్ని నింపింది. రెండు వారాల వ్యవధిలో అక్క, తల్లిని వేదా కోల్పోయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యింది. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు సహచరులు కూడా వేదాను ఓదార్చారు.

కాగా ఈ విషయంలో బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని లీసా ఆరోపించారు. ‘వేదా భారత జట్టు రెగ్యులర్ సభ్యురాలు. ఆమె బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్. అలాంటి వేదా ఇంట్లో విషాదం నెలకొంటే బీసీసీఐ కనీసం పరామర్శించలేదు. ఇలాంటి సమయంలో ఆమెను బీసీసీఐ టూర్‌కు ఎంపిక చేయలేదు. ఆమె బాధలో ఉన్నందున ఎంపిక చేయలేదని అనుకున్నాను. కానీ ఇలా ఎంపిక చేయకుండా బీసీసీఐ చేతులు దులుపుకున్నది. బోర్డు ఆమెతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. బీసీసీఐ పద్దతి సరైనది కాదు’ అంటూ లీసా స్టాలేకర్ విమర్శించారు. కాగా, వేదా టీమ్ ఇండియా తరపున 48 వన్డేల్లో 829 పరుగులు, 76 టీ20ల్లో 875 పరుగులు చేసింది.

Tags:    

Similar News