రూ.2,389.61 కోట్ల మద్యం తాగేశారు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన మద్యం షాపులు మూతపడి..చుక్క మందులేక మందుబాబులు అల్లాడిపోయారు.. అయితే, మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక..వరుసగా రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ అమ్మకాల్లో అదే జోరు కొనసాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే కేవలం జూన్ నెలలోనే రూ.2,389.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇది అల్ టైం రికార్డుగా చెప్పుకోవాలి. ఎందుకంటే..గతేడాది జూన్ నెలతో పోలిస్తే […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన మద్యం షాపులు మూతపడి..చుక్క మందులేక మందుబాబులు అల్లాడిపోయారు.. అయితే, మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక..వరుసగా రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ అమ్మకాల్లో అదే జోరు కొనసాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే కేవలం జూన్ నెలలోనే రూ.2,389.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇది అల్ టైం రికార్డుగా చెప్పుకోవాలి. ఎందుకంటే..గతేడాది జూన్ నెలతో పోలిస్తే అమ్మకాలు ఈసారి భారీగా పెరిగాయి. గతేడాది జూన్ నెలలో రూ.1,851.35 కోట్ల విలువైన మద్యాన్ని మాత్రమే విక్రయించారు.ఓ వైపు కరోనా కొత్త కష్టాలు తీసుకొచ్చినా..ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నా, ఉపాధి దెబ్బతిన్నా..మద్యం అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది.