అప్పటివరకు యథావిధిగా మద్యం అమ్మకాలు

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా నూతన మద్యం పాలసీని ప్రకటించనందున నవంబర్ 30 వరకూ మద్యం అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లోని స్టాక్‌ను విక్రయించుకునే అవకాశంతో పాటు డిపోల నుంచి మద్యం స్టాక్‌ను కొనుగోళ్లకు కూడా అనుమతించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ప్రస్తుతం జారీ చేసిన […]

Update: 2020-10-31 11:42 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా నూతన మద్యం పాలసీని ప్రకటించనందున నవంబర్ 30 వరకూ మద్యం అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లోని స్టాక్‌ను విక్రయించుకునే అవకాశంతో పాటు డిపోల నుంచి మద్యం స్టాక్‌ను కొనుగోళ్లకు కూడా అనుమతించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలు అమల్లో ఉంటాయని డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News