జూ పార్క్ లోని సింహాలకు కరోనా.. నిర్దారించిన అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ విజృంభిస్తోంది. వైరస్ మనుషులతో పాటు, జంతువులకు కూడా వ్యాప్తి చెందుతుందని మొదటి వేవ్ సమయంలోనే శాస్త్రవేత్తలు, వైద్యులు ధృవీకరించారు. దీంతో అన్ని జూ పార్క్ లలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లోని జూ పార్క్ లోని సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. వీటిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. సాయంత్రం విడుదలైన ఫలితాల్లో 8 సింహాలకు కరోనా […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ విజృంభిస్తోంది. వైరస్ మనుషులతో పాటు, జంతువులకు కూడా వ్యాప్తి చెందుతుందని మొదటి వేవ్ సమయంలోనే శాస్త్రవేత్తలు, వైద్యులు ధృవీకరించారు. దీంతో అన్ని జూ పార్క్ లలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లోని జూ పార్క్ లోని సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. వీటిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. సాయంత్రం విడుదలైన ఫలితాల్లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లోని జూ పార్క్ లోని సింహాలకు పాజిటివ్ వచ్చినట్లు జూ అధికారులు నిర్ధారించారు.