లింక్డిన్ లో.. వైద్యరంగంలోని నిపుణులు, ఉద్యోగార్థుల వివరాలు

దిశ వెబ్ డెస్క్: కరోనాతో దేశం మొత్తం పోరాడుతోంది. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వలాంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎంతో మంది కరోనాను కట్టడి చేయడానికి అవిశ్రాంతంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అయినా.. అత్యవసర విభాగాల్లో ఇంకా మరెంతో మంది సేవలు అవసరం ఉన్నది. ఇంకా మనం రెండో దశలోనే ఉన్నాం. ఒకవేళ మూడో దశలోకి ప్రవేశిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకు మరింత మంది సేవలు అవసరం అవుతాయి. అందువల్ల కరోనాతో […]

Update: 2020-04-03 04:58 GMT

దిశ వెబ్ డెస్క్: కరోనాతో దేశం మొత్తం పోరాడుతోంది. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వలాంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎంతో మంది కరోనాను కట్టడి చేయడానికి అవిశ్రాంతంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అయినా.. అత్యవసర విభాగాల్లో ఇంకా మరెంతో మంది సేవలు అవసరం ఉన్నది. ఇంకా మనం రెండో దశలోనే ఉన్నాం. ఒకవేళ మూడో దశలోకి ప్రవేశిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకు మరింత మంది సేవలు అవసరం అవుతాయి. అందువల్ల కరోనాతో పోరుతున్న సంస్థలకు లింక్డిన్ తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. విపత్కర పరిస్థితుల్లో లాభాపేక్షలేకుండా పనిచేస్తున్న సంస్థలకు ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ 30 వరకు తమ ఉద్యోగ ప్రకటనల్ని లింక్డ్ ఇన్ లో ఉచితంగా పోస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

దేశవ్యాప్తంగా కరోనా పోరులో చాలా సంస్థలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. హెల్త్ కేర్, సూపర్ మార్కెట్లు, నిత్యవసర సరుకు రవాణా చేసే సంస్థలు, గిడ్డంగులు, డైరీ ఫాంలు ఇలా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని లింక్డ్ ఇన్ కల్పించింది. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలో సిబ్బందిని నియమించుకునేందుకు లింక్డ్ ఇన్ ‘‘టాలెంట్ ఇన్ సైట్స్’’ పేరుతో మూడు నెలల పాటు వైద్యరంగంలోని నిపుణులు, ఉద్యోగార్థుల వివరాలను అందులో పొందుపరచనుంది. దీంతో పాటు ‘రిక్రూటింగ్ ఫర్ గుడ్ ’ అనే కార్యక్రమం ద్వారా స్వయంగా తమ సిబ్బందితోనే నైపుణ్యానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగులను, వలాంటీర్లను నియమించుకుంటోంది. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సంస్థలు వెంటనే ఈ సిబ్బందిని భర్తీ చేసుకోవడానికి అవకాశం దొరకుతుంది. ‘ప్రజల కోసం కరోనాపై పోరాడుతున్న ఎంతోమంది వీరగాధలు వింటున్నాం. కరోనాను ఎదుర్కొనేందుకు ఇంకా చాలా మంది సహాయం కావాలి. సంబంధిత విభాగాల్లో నైపుణ్యాలున్న సిబ్బందిని నియమించుకునే ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని లింక్డిన్ ఇండియా డైరెక్టర్ ఆనంద్ తెలిపారు..

Tags : coronavirus, lockdown, linkedin , jobs, careers, health care,

Tags:    

Similar News