ఇకపై ‘లింక్డ్‌ఇన్’లోనూ పోల్స్ ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా టాపిక్‌పై పోల్స్ పెట్టడం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేసిన సందర్భాల్లో లేదా ఓ వ్యక్తి డెసిషన్ తీసుకోవడంలో సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఫీడ్ బ్యాక్ తీసుకునే విషయమై ఇలాంటి పోల్స్ పెడుతుంటారు. అయితే ఇలాంటి ఫీచర్‌నే ఇప్పుడు లింక్డిన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ‘పోల్స్ ఫీచర్స్’ను లింక్డిన్ తాజాగా అనౌన్స్ చేయడంతో ‘డెసిషన్ మేకింగ్’కు సంబంధించి ప్రొఫెషనల్స్, ఎక్స్‌పర్ట్స్ నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా టాపిక్‌పై పోల్స్ పెట్టడం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేసిన సందర్భాల్లో లేదా ఓ వ్యక్తి డెసిషన్ తీసుకోవడంలో సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఫీడ్ బ్యాక్ తీసుకునే విషయమై ఇలాంటి పోల్స్ పెడుతుంటారు. అయితే ఇలాంటి ఫీచర్‌నే ఇప్పుడు లింక్డిన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది.
‘పోల్స్ ఫీచర్స్’ను లింక్డిన్ తాజాగా అనౌన్స్ చేయడంతో ‘డెసిషన్ మేకింగ్’కు సంబంధించి ప్రొఫెషనల్స్, ఎక్స్‌పర్ట్స్ నుంచి ఒపీనియన్లు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని యూజర్లు భావిస్తున్నారు. కరోనా సంక్షోభం వల్ల మార్కెటర్స్, హెచ్ఆర్ హెడ్స్, రిక్రూటర్స్, కంపెనీ హెడ్స్ అందరూ కూడా సంబంధిత సబ్జెక్ట్‌పై వేరియస్ ఫీల్డ్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. వీటిల్లో వర్క్‌ప్లేస్ ప్రిఫరెన్స్, షాపింగ్ హ్యాబిట్స్, ఆన్‌లైన్ సర్వీసెస్‌ను కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
పోల్ ఎలా క్రియేట్ చేయాలి?
– న్యూ పోస్ట్ రాసి.. మెనూ నుంచి ‘క్రియేట్ పోల్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
– క్వశ్చన్‌ను టైప్ చేసి ఆన్సర్ కోసం 4 ఆప్షన్లు ఇవ్వాలి. అంతేకాదు పోల్ డ్యూరేషన్ సెలెక్ట్ చేయాలి. 24 గంటల నుంచి రెండు వారాలు లేదా నెల.. అది యూజర్ ఇష్టం.
– యూజర్ నిర్వహించే పోల్‌కు అటెన్షెన్ డ్రా చేయడం కోసం.. హ్యష్ ట్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు.
– లింక్డిన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన గ్రూప్‌లలో ‘లైవ్ పోల్’ పెట్టుకోవచ్చు.
ఫలితాలు ?
ఓటింగ్ గడువు ఎప్పటిలోగా ముగిసిపోనుంది? ఇప్పటివరకు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి? వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఎవరు ఓట్ వేశారు, ఎందుకు ఓటు వేశారు ? అనే విషయాలు మాత్రం పోల్ క్రియేటర్‌కు మాత్రమే తెలుస్తాయి. పోల్ మొత్తం పూర్తయిన తర్వాత విన్నింగ్ ఆప్షన్, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్, టోటల్ ఓట్ కౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం సదరు పోల్ పెట్టిన వ్యక్తికి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.