700 మిలియన్ల లింక్డ్‌ఇన్ డేటా బ్రీచ్‌పై క్లారిటీ ఇచ్చిన కంపెనీ
దిశ, ఫీచర్స్ : ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ దాదాపు 750 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉంది. ఇందులో 700 మిలియన్ల యూజర్స్ డేటా లీకైనట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే 92శాతం మంది డేటా దొంగతనం జరగడమనేది మామూలు విషయం కాదని, తమ అధ్యయనంలో ఎలాంటి డేటా బ్రీచ్ జరగలేదని లింక్డ్‌ఇన్ పేర్కొంది. 700మిలియన్ మంది డేటా తమ దగ్గర ఉందని అమ్మకానికి పెడుతున్నట్లు హ్యాకర్ ఫారం ఇటీవలే ప్రకటించింది. […]
దిశ, ఫీచర్స్ : ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ దాదాపు 750 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉంది. ఇందులో 700 మిలియన్ల యూజర్స్ డేటా లీకైనట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే 92శాతం మంది డేటా దొంగతనం జరగడమనేది మామూలు విషయం కాదని, తమ అధ్యయనంలో ఎలాంటి డేటా బ్రీచ్ జరగలేదని లింక్డ్‌ఇన్ పేర్కొంది.
700మిలియన్ మంది డేటా తమ దగ్గర ఉందని అమ్మకానికి పెడుతున్నట్లు హ్యాకర్ ఫారం ఇటీవలే ప్రకటించింది. ప్రూఫ్ కోసం మిలియన్ మంది డేటాను శాంపుల్‌గా బహిర్గతం చేయగా ఆ డేటాలో ఈమెయిల్ అడ్రస్‌లు, పూర్తి పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామా, జియోలొకేషన్లు, లింక్డ్ఇన్ యూజర్ నేమ్, ప్రొఫైల్ యూఆర్ఎల్, పర్సనల్, ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ వివరాల, జెండర్ ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో లింక్డ్ ఇన్ తమ రీసెర్చ్ బృందాలతో ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ చేయగా, ప్రైవేట్ లింక్డ్ఇన్ సభ్యుల డేటా బహిర్గతం కాలేదని స్పష్టం చేశాయి. తమ అధ్యయనంలో లింక్డ్ఇన్‌తో పాటు ఇతర అనేక వెబ్‌సైట్లలో ఏప్రిల్ 2021 వరకూ ఒకే డేటా ఇచ్చిన వారి వివరాలు మాత్రమే అప్‌డేట్ అయ్యాయని కంపెనీ స్టేట్మెంట్‌లో పేర్కొంది. ‘తమ సభ్యుల డేటాను దుర్వినియోగం చేసేందుకు లింక్డ్ఇన్ ఒప్పుకోదు. ఒకవేళ ఇతరుల తమ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి ప్రయత్నించినప్పుడు, మేము ఆ చర్యలను అడ్డుకోవడంతో పాటు సమస్యకు జవాబుదారీగా ఉండడానికి కృషి చేస్తాము’ అని కంపెనీ తెలిపింది.