మూడు రోజులు తేలికపాటి వర్షాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో వర్షాలు కురియనున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో పొడివాతావరణం నెలకొంటుందని వివరించారు. గురువారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా గుడిగుడా మండలం, […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో వర్షాలు కురియనున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో పొడివాతావరణం నెలకొంటుందని వివరించారు.
గురువారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా గుడిగుడా మండలం, లోకరి కే గ్రామంలో 22.3మిమీ వర్షాపాతం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో 16.5మిమీ వర్షాపాతం నమోదైంది.