ప్లాష్.. ప్లాష్.. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
దిశ ప్రతినిధి, నల్లగొండ : శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తడంతో సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో, సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. ఈ కారణంగా అధికారులు 14 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన […]
దిశ ప్రతినిధి, నల్లగొండ : శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తడంతో సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో, సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. ఈ కారణంగా అధికారులు 14 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో వచ్చిన వరదను వచ్చినట్లు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువ ప్రాంతాలను, నది సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గేట్లు ఎత్తే క్రమంతో మొదటగా అధికారులు 13వ నంబర్ గేటును ఎత్తారు.