కరోనా ఆంక్షలు ఎత్తివేత.. అక్కడకి క్యూ కట్టిన టూరిస్టులు

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుండి కరోనా రక్కసి ప్రపంచంపై పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వలన అనేక రంగాలు కుదేలైయ్యాయి. అందులో పర్యాటక రంగం ఒకటి. లాక్ డౌన్ వలన గతేడాది మొత్తం ఇంట్లోనే గడపాల్సివచ్చింది. ఇక ఈ ఏడాదైన విహారయాత్రలకు వెళ్లొచ్చు అనుకొనేలోపు సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో హిల్ స్టేషన్స్ లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ లో కరోనా ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో పర్యాటకులు సిమ్లా కు […]

Update: 2021-06-14 00:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుండి కరోనా రక్కసి ప్రపంచంపై పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వలన అనేక రంగాలు కుదేలైయ్యాయి. అందులో పర్యాటక రంగం ఒకటి. లాక్ డౌన్ వలన గతేడాది మొత్తం ఇంట్లోనే గడపాల్సివచ్చింది. ఇక ఈ ఏడాదైన విహారయాత్రలకు వెళ్లొచ్చు అనుకొనేలోపు సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో హిల్ స్టేషన్స్ లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ లో కరోనా ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో పర్యాటకులు సిమ్లా కు క్యూ కట్టారు. సిమ్లాలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. పాస్‌లు, నెగెటీవ్ సర్టిఫికెట్లు అవసరం లేకపోవడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు సిమ్లాకు పయనం అయ్యారు. దీంతో ఆదివారం రోడ్డు పొడువునా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద ఎత్తన పర్యాటకులు సిమ్లాకు రావడంతో పర్యాను వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News