ఆత్మహత్య ధోరణిలో యువత.. సినిమాలోని సీన్స్, ధైర్యం కోల్పోవడమే కారణమా!

యువతే దేశానికి భవిత అంటారు. వారితోనే అభివృద్ధి జరుగుతుందని చెప్తారు. కానీ నేటి యువతరం మాత్రం, దేశ అభివృద్ధి వైపు అడుగులు వేయడం కాకుండా సూసైడ్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లోని యువతలో ఆత్మహత్య

Update: 2024-06-18 10:06 GMT

దిశ, ఫీచర్స్ : యువతే దేశానికి భవిత అంటారు. వారితోనే అభివృద్ధి జరుగుతుందని చెప్తారు. కానీ నేటి యువతరం మాత్రం, దేశ అభివృద్ధి వైపు అడుగులు వేయడం కాకుండా సూసైడ్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లోని యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకరమైన విషయం. ఇప్పటికీ మనం ఎన్నో వార్తలు చూస్తున్నాం. యువకుడు సూసైడ్, తల్లి మందలించడం, ప్రేమ విఫలం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నింటి వలన యువత ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతుంది. కానీ సూసైడ్ అనేది చాలా తెలివి తక్కువ పని అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. మనల్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుతారు, వారు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి వారిని వదిలేసి చనిపోవడం అనే ఆలోచన చేయడం కన్నా మరో మూర్ఖత్వపు పని ఏదీ లేదంటున్నారు కొందరు. ఇక ఈ ఆత్మహత్య అనే ఆలోచన పిరికిపందలు, బలహీనులు, ఎలాంటి ఆలోచన శక్తి లేని వారే చేస్తారు. ఎందుకంటే సమస్యల నుంచి బయట పడటానికి ఎన్నో దారులు ఉంటాయి. బలంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుంది. కానీ అలాంటి వాటి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ముందు ఉన్న చిన్న సమస్యనే పెద్దదిగా చూసి ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ నీ ప్రాణం తీసుకో వడానికి ఒక్క క్షణం ఆలోచించి చూస్తే నీకు ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి. అసాధ్యమైన పనిని కూడా చేయగలవు అందుకే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం తెచ్చుకొని, సమస్యతో పోరాడితే ఆ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి యువత సూసైడ్ అనే భావన నుంచి బయటకు రావాలని చెబుతున్నారు నిపుణులు. మనో నిబ్బరం మించిన ఆయుధం లేదు, అది ఎప్పుడూ కోల్పోకూడదు, చిన్ని చిన్న విషయాలకు ప్రాణాలను నీకు నీవే తుంచి వేసుకో కూడదు, నీ విలువైన జీవితాన్ని కోల్పోకూడదు అని చెబుతున్నారు. అయితే ఈ మధ్య కొంత మంది సినిమాల్లో సీన్స్ చాలా ఫాలో అవుతూ ప్రాణాలను కోల్పోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో లవర్ కోసం చనిపోవాలని పాయిజన్ తీసుకోవడం, మళ్లీ బతుకుతాం కదా అని కాస్త తక్కువ పాయిజన్ తీసుకోవడం, కానీ పరిస్థితి చేజారడంతో వారు చనిపోవడం జరుగుతుంది. అయితే అలా మూవీస్‌లో సీన్స్ ఫాలో కాకుండా, సమస్యను సొంతంగా, కుటుంబంతో పరిష్కరించుకోవాలని చెబుతున్నారు నిపుణులు.


Similar News