వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందిస్తున్న కిటికీలు..శాస్త్రవేత్తల సృష్టి
మీ ఇంటి కిటికీలు భవిష్యత్తులో పోర్టల్స్‌గా మారబోతున్నాయి.
దిశ, ఫీచర్స్ : మీ ఇంటి కిటికీలు భవిష్యత్తులో పోర్టల్స్‌గా మారబోతున్నాయి. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇప్పటికే మన ఇళ్లు, పరికరాలకు శక్తినిచ్చే విద్యుత్తును ఉత్పత్తి చేసే కిటికీలను తయారుచేయగా.. ఇప్పుడు సౌదీ అరేబియా పరిశోధకులు ప్రత్యేక గాజుతో సూర్యకాంతిని ఉపయోగించి వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్‌ను ప్రసారం చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఫ్యూచర్‌లో ఆఫీస్ బిల్డింగ్స్ అన్ని ఇలాంటి గ్లాస్ విండోస్‌ను ఏర్పాటు చేసుకుని, ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీని బ్రాడ్‌బ్యాండ్ వేగం 15-16 Kbps ఉండగా..హై డేటా రేట్‌ను సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎలా పనిచేస్తుంది?
గాజు కిటికీలను మోడమ్‌గా ఊహించుకోండి. సౌదీ ఆవిష్కరణ స్మార్ట్ గ్లాస్ మూలకాలైన 'డ్యూయల్-సెల్ లిక్విడ్ క్రిస్టల్ షట్టర్లు (DLS)' ఉపయోగించి డేటాను బదిలీ చేయడానికి సన్‌లైట్ పోలరైజేషన్‌ను ఉపయోగిస్తుంది. కాంతి వంటి విద్యుదయస్కాంత తరంగాల లక్షణాలలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పోలరైజేషన్ ఒకటి కాగా పోలరైజ్డ్ సన్ గ్లాసెస్, కాంతిని ఫిల్టర్ చేయడానికి విద్యుదయస్కాంత ధ్రువణాన్ని ఉపయోగిస్తాయి. అవి ప్రతిబింబించే కాంతిని నిరోధిస్తాయి, కంటికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన దృష్టిని సులభతరం చేయడానికి ఉపయోగకరమైన కాంతిని మాత్రమే అందిస్తాయి. పోలరైజ్ కాకుండా వచ్చే కాంతికి చాలా దిశలు ఉంటాయి. పోలరైజేషన్ దిశను నిర్వహిస్తుంది. కొంత కాంతిని దాటడానికి, కొంత కాంతిని దాటకుండా చేస్తుంది.
ఇంటర్నెట్‌తో సంబంధం ఏంటి?
పోలరైజేషన్ సూర్యరశ్మిని ఒక రకమైన బైనరీ లాంగ్వేజ్ (ఒకటి-సున్నా భాష)గా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది స్మార్ట్ గ్లాస్ అంచుకు కనెక్ట్ చేయబడిన LAN కేబుల్ ద్వారా వచ్చే అసలు డేటా ద్వారా ముందుగా నిర్ణయించబడుతుంది. ఒక LAN కేబుల్ రౌటర్‌కి వెళుతుంది. ఆపై మనం ఈ వైఫై సిగ్నల్‌ను పొందుతాం. ల్యాండ్ కేబుల్‌కు ట్రాన్స్‌మీటర్‌గా ఉండే గ్లాస్..సిగ్నల్‌ను ప్రొపగేట్ చేసేందుకు విద్యుత్తును కాకుండా సూర్యకాంతిని ఉపయోగిస్తుంది. మానవ కంటికి కనిపించని లైట్ వేరియేషన్..వైర్‌లెస్ ఇంటర్నెట్ డేటాను గదిలోని డివైజెస్‌కు కమ్యూనికేట్ చేస్తుంది. 'బేసికల్లీ మేము మల్టిపుల్ లేయర్స్ కలిగిన చిన్న పరికరంతో ఈ ప్రయోగం చేశాం. ఈ పొరలు గాజు పారదర్శకతను మోడల్ చేయడం ద్వారా కాంతి ధ్రువణత(లైట్ పోలరైజేషన్)ను మార్చగలవు. ఒపేసిటీ(కాంతిని అడ్డుకోవడం) చాలా వేగంగా మార్చినప్పుడు, డేటా ప్రవాహం ఏర్పడుతుంది' అని ప్రయోగంలో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.
గ్లాస్ ఇంటర్నెట్ పొందేందుకు సిద్ధమేనా?
సాధారణంగా వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ లేదా ఆప్టికల్ కమ్యూనికేషన్‌పై ఆధారపడి ఉంటాయి. దీనికి లేజర్‌లు, లైట్-ఎమిటింగ్ డయోడ్‌ల (LED) వంటి ఎనర్జీ-ఎక్స్‌పెన్సివ్ యాక్టివ్ లైట్ సోర్స్‌లు అవసరమవుతాయి. అయితే సౌదీ సిస్టమ్ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది సమాచారాన్ని తీసుకువెళ్లడానికి LEDల కాంతిని మాడ్యులేట్ చేస్తుంది. మొత్తానికి ఈ టీమ్ అప్రోచ్ భిన్నమైనది. ఎందుకంటే ఇది సహజమైన సూర్య కాంతి యొక్క తీవ్రతను కూడా మాడ్యులేట్ చేస్తుంది. అదే సమయంలో ఇంటర్నెట్ డేటాను గ్లాస్ ఒపేసిటీ ద్వారా ఎన్‌కోడ్ చేస్తుంది. ఆపై దానిని గదిలోని పరికరాల ద్వారా డిటెక్ట్, డీకోడ్ చేయవచ్చు. సూర్యుడి ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ నుంచి ప్రయోజనం పొందగల పరికరాలను పోలరైజ్డ్ ఇన్ఫర్మేషన్‌ను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించాలి.
READ MORE
అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారు.. డాక్టర్ సమరం చెబుతుంది ఇదే!