Sexual Life style : అజీర్ణంతో శృంగార జీవితంలో అసౌకర్యం.. గర్భాధారణ కష్టమేనా ?
దిశ, ఫీచర్స్ : గట్ మరియు సెక్స్ లైఫ్‌కు మధ్య క్లోజ్ కనెక్షన్ ఉందని చెప్తున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు.. లైంగిక సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వివరిస్తున్నారు. అనేక మార్గాల్లో గట్ అండ్ సెక్స్ లైఫ్ అనుసంధానించబడి ఉండటమే ఇందుకు కారణం అంటున్న ఎక్స్‌పర్ట్స్.. వీటి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఇలాంటి సమస్యను ఎలా అధిగమించవచ్చు? అనే విషయాల గురించి పలు సూచనలు అందించారు.
గట్ హెల్త్-సెక్స్ లైఫ్.. లింక్?
ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తినే సమయంలో అనుభవించే 'మంచి అనుభూతి'.. అలాగే డైజెషన్ టైమ్‌లో పొందే అనుభూతి వేర్వేరుగా ఉంటుంది. ఈ రెండు గట్ చర్యలు సరిగ్గా జరిగినప్పుడే బాడీలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. పూర్తిగా పేగులలో ఉండే ఈ హార్మోన్.. సెక్సువల్ హెల్త్ యాక్టివిటీపై ప్రభావం చూపుతుంది. హ్యాపీ హార్మోన్ రిలీజై హ్యాపీ మూడ్‌తో ఉంటే.. లిబిడో(సెక్సువల్ డ్రైవ్)పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. లేదంటే నెగెటిఫ్ ఎఫెక్ట్‌తో సెక్స్ లైఫ్ నరకంగా మారుతుంది.
గట్ హెల్త్ ఇష్యూస్‌తో ఎఫెక్ట్?
ఆరోగ్యకరమైన ప్రేగులలో తగినంత సెరోటోనిన్ స్రావం ఉంటుంది. అయినప్పటికీ పేగు ఆరోగ్యం సూక్ష్మజీవుల ఫ్లోరాపై ఆధారపడి ఉంటుంది. ఇది సెరోటోనిన్ స్రావంలో సహాయపడుతుంది. ఒకవేళ పేగు వాపు ఏర్పడితే సెరోటోనిన్ సీక్రెషన్‌ను డిస్టర్బ్ చేస్తూ, తద్వారా లిబిడోపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. అంటే ప్రేగులకు సంబంధించిన అన్ని లక్షణాలు.. వ్యక్తి యొక్క శారీరక, భావోద్వేగ, లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
గట్‌తో సెక్స్ లైఫ్ ప్రభావాలు:
*అజీర్ణంతో అసౌకర్యం
ఎక్కువ ఆహారం తీసుకున్నా లేదా అజీర్ణంతో బాధపడుతున్నా.. ఆ నొప్పి, అసౌకర్యం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. వాస్తవానికి మలబద్ధకం, విరేచనాలు, కడుపు తిమ్మిరి, ఉబ్బరానికి కారణమయ్యే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) కలిగి ఉండటం వలన సెక్స్ బాధాకరంగా ఉంటుంది. లైంగిక కార్యకలాపాల చర్యకు మానసిక ఒత్తిడిని జోడిస్తుంది. ఇంకొందరిలో గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) లక్షణాలను అనుభవించేలా చేస్తుంది.
*అజీర్ణం సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది
హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మానసిక స్థితిని నియంత్రిస్తుంది. సెక్స్‌ను మరింత ఆనందదాయకంగా మార్చే ఈ కెమికల్ కారణంగా వ్యక్తి తక్కువ ఆత్రుత, నిరాశకు గురవుతాడు. అయితే వికారం, వాంతులకు కారణమయ్యే ప్రకోప ప్రేగు సిండ్రోమ్.. సెరోటోనిన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. తద్వారా లైంగిక ఆనందాన్ని పొందడాన్ని కష్టతరం చేస్తుంది.
* యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI) సర్వసాధారణం. అజీర్ణం యోని ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే.. కిడ్నీ సమస్యలకు కూడా దారి తీస్తుంది. అదనంగా, మీరు ఇప్పటికే UTIని కలిగి ఉన్నట్లయితే పొత్తికడుపుపై ప్రభావం చూపే జీర్ణ సమస్యలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీంతో సెక్స్ సమయంలో ఒత్తిడి, వేదనను అనుభవించవచ్చు.
* గట్ మైక్రోబయోటా- అంగస్తంభన పనితీరు
సెక్స్ యొక్క ముఖ్య భాగం గట్ మైక్రోబయోటా కావచ్చు. గట్ మైక్రోబయోటా హార్మోన్ స్థాయిలు, తాపజనక మధ్యవర్తులు, పురుషుల అంగస్తంభన పనితీరును నియంత్రించగలదు. ఈ కారణంగా లైంగిక, మానసిక, శారీరక ఆరోగ్యానికి ఈ బ్యాక్టీరియా యొక్క ప్రాపర్ బ్యాలెన్స్ అవసరం.
* గట్ సమస్యలతో ఒత్తిడి
గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను సరదాగా తీసుకుంటారు కానీ ఇవి గర్భధారణను కూడా అడ్డుకోగలవు. ఇలాంటి సందర్భాల్లో శరీరం ఒత్తిడికి గురికావడంతో సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి బదులుగా కార్టిసాల్‌ను స్రవిస్తుంది.
వర్కవుట్స్‌తో తప్పని ఎటాక్.. తీవ్రమైన వ్యాయామాలతో గుండెపోటు ?