మీ ద‌గ్గ‌రున్న క‌రెన్సీ నోటుపైన ఈ సీరియ‌ల్ నెం. ఉంటే రూ. 3ల‌క్ష‌లు మీవే..!

కొన్ని సులభమైన స్టెప్‌లను ఫాలో అయితే స‌రిపోతుంది. You can earn up to Rs 3 lakh by selling currency note.

Update: 2022-05-14 09:24 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలు సేకరించే వారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అది ఎలాంటి అభిరుచి అంటే, కావాల‌నుకున్న‌ప్పుడు రూపాయి నాణెం కోసం ప‌దివేలు కూడా ఖ‌ర్చు చేయ‌డానికి వెనుకాడ‌రు. అయితే, ఆ నాణానికి అంత విలువ ఉండాలి మ‌రి! ఇలాగే, ఒక సాధారణ నాణెం లేదంటే నోటుపైన ఉన్న నిర్దిష్ట క్రమ సంఖ్యలు, చిత్రాలు దాని విలువను అనేక రెట్లు పెంచుతుంది. అయితే, ప్ర‌స్తుతం ఆన్‌లైన్ సెల్లింగ్ సైట్ల‌లో ఒక సీరియ‌ల్ సంఖ్య చాలా డిమాండ్లో ఉంది. మీ ద‌గ్గ‌ర ఉన్న క‌రెన్సీ నోట్ల‌పైన ఈ సంఖ్య ఉంటే మీ జేబులో లక్షల రూపాయలు ప‌డ్డ‌ట్లే..!

కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్‌లో ఉన్న‌ '786' సంఖ్య కోసం ప్ర‌స్తుతం క‌రెన్సీ సేక‌రించేవారు వెదుకుతున్నారు. ఈ నిర్దిష్ట క్రమంలో కనిపించే ఈ మూడు అంకెలు నోటుతో దాదాపు రూ. 3 లక్షల వ‌ర‌కూ సంపాదించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే, ఇస్లాం అనుస‌రించే వారిలో 786 సంఖ్య శుభప్రదంగా పరిగణిస్తారు. కనుక‌, ఈ సీరియ‌ల్‌తో ఉన్న నోటు దొరికితే దాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేయ‌డం వ‌ల్ల దాని విలువ ఎంతైనా పెర‌గొచ్చు. ప్ర‌స్తుతం, eBay లాంటి కొన్ని ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల‌లో ఇతర ఉత్ప‌త్తుల‌తో పాటు, ప్రత్యేకమైన కరెన్సీ నోట్లు, నాణేలను అమ్మ‌డానికి, కొనుగోలు చేయడానికి అనుమ‌తులు ఉన్నాయి. వీటికోసం ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా లేక‌పోలేదు. అలాగే, కొందరు ఇలాంటి అరుదైన నోట్ల‌ను సోషల్ మీడియాలోనూ అమ్ముతుంటారు.

ఇక‌, eBay చాలా కాలంగా ఉన్న ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ గ‌నుక‌ దాని బ్రాండ్ ఇలాంటి వాటి కోసం ప్రాధాన‌ వేదికగా మారింది. క‌నుక‌, సీరియల్ నంబర్‌లో 786 ఉన్న మీ ప్రత్యేకమైన నోట్లను అమ్ముకోవాల‌ని చూస్తున్న వ్యక్తులు కొన్ని సులభమైన స్టెప్‌లను ఫాలో అయితే స‌రిపోతుంది:

స్టెప్ 1: www.ebay.comకి వెళ్లండి.

స్టెప్‌ 2: హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోండి.

స్టెప్ 3: మీరు విక్రయించాలనుకుంటున్న నోట్‌కు స్పష్టమైన, మంచి నాణ్యత గల ఫోటోను తీసి ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయండి. అటువంటి నోట్ కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు eBay జాబితాలో మీ ఆఫ‌ర్‌ను చూపుతుంది.

స్టెప్ 4: మీ ప్రకటనను చూసిన తర్వాత ఆసక్తిగల కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ధరను ఖరారు చేసి వారికి నోటును అమ్మవచ్చు.


రూ. 2వేల కోసం పనిచేస్తున్న కమల్ హాసన్ మాజీ భార్య



Similar News