వరల్డ్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ డ్రగ్.. ఒక్క డోస్ రూ. 28 కోట్లు
ప్రపంచలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ను ఆమోదించింది అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA)..
దిశ, ఫీచర్స్: ప్రపంచలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ను ఆమోదించింది అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA). 'హెమ్జెనిక్స్'గా పిలువబడుతున్న ఈ ఔషధం ఒక్క డోస్ విలువ ఏకంగా రూ.28కోట్ల 58లక్షలు కాగా.. 'హిమోఫిలియా B' ట్రీట్మెంట్‌తో బాధపడుతున్న రోగులను ట్రీట్ చేస్తుంది.
హిమోఫిలియా వ్యాధి అంటే ఏమిటి?
హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఇందులో అనేక రకాల వ్యాధులుండగా.. 'హిమోఫిలియా B' చాలా అరుదు. రక్తంలో ప్రోటీన్ లోపం ఉన్న వ్యక్తికి ఈ డిసీజ్ సంక్రమించడం ద్వారా చిన్న గాయమైనా సరే రక్తం గడ్డకట్టకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. చివరకు ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా ఈ ప్రొటీన్‌ను 'క్లాటింగ్ ఫ్యాక్టర్' అని కూడా అంటారు.
ఒక్క డోస్‌తో ఉపశమనం
FDA ప్రకారం.. 'Hemgenix' ఔషధం 'హీమోఫిలియా B' రోగులపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఖరీదైనది కావచ్చు కానీ జీవితకాల చికిత్స కంటే తక్కువ ఖర్చుగానే పరిగణించబడుతుంది. అమెరికాలో ఒక రోగి హిమోఫిలియా చికిత్సకు దాదాపు రూ. 171 నుంచి రూ. 181 కోట్లు ఖర్చవుతుందని నిపుణుల అంచనా. కాగా ప్రస్తుతం FDA ఎన్ని మోతాదుల ఔషధం ఈ వ్యాధి నుంచి రక్షించగలదని సమాచారం ఇవ్వలేదు. కానీ కేవలం ఒక్క డోస్ తీసుకోవడం వలన రక్తస్రావం తగ్గి, రక్తం గడ్డకట్టడం జరుగుతుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి