50ఏళ్ల గాయాలు నెలల్లో మాయం.. సరికొత్త జెల్‌తో సాధ్యం
డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా (DEB) అనేది అరుదైన చర్మ వ్యాధి.
దిశ, ఫీచర్స్: డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా (DEB) అనేది అరుదైన చర్మ వ్యాధి. దీని ఫలితంగా చర్మంపై నిరంతరం పొక్కులు ఏర్పడటమే కాకుండా నయం చేయలేని గాయాలుగా మారిపోతాయి. లైఫ్ లాంగ్ నొప్పితో బాధపడేలా చేస్తాయి. COL7A1 జన్యువులోని ఉత్పరివర్తన వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కాగా ఇది కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. అయితే ఇందుకు సరికొత్త జీన్ థెరపీని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. COL7A1 జన్యువు వర్క్ కాపీలను నేరుగా గాయపడిన కణజాలానికి అందించడానికి జెల్‌ను రూపొందించారు. ఇది చర్మం నయం కావడానికి అవసరమైన కొల్లాజెన్ ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫంక్షనల్ జీన్స్ మోడిఫైడ్ హెర్పెస్ వైరస్ ద్వారా పంపిణీ చేయబడుతుండగా..ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి.
ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో.. ఇందుకు సంబంధించిన ఫేజ్ 3 డబుల్ బ్లైండ్, ప్లేసిబో-నియంత్రిత ట్రయల్ ఫలితాలు ప్రచురితమయ్యాయి. రోగులకు వారానికోసారి జీన్ థెరపీ జెల్‌తో చికిత్స అందించగా..మూడు నెలల తర్వాత 71% మంది నయమయ్యారు. వీరిలో 67శాతం వరకు గాయాలు హీల్ అయ్యాయి. కానీ జెల్ థెరపీ ద్వారా 20ఏళ్ల గాయం మానిపోగా..ట్రీట్మెంట్ ఆపేశాక గాయాలు మళ్లీ వెంటాడుతున్నాయనేది రోగుల కంప్లయింట్. కాగా దీన్ని ముందే ఎక్స్‌పెక్ట్ చేశామని చెప్తున్న శాస్త్రవేత్తలు..జెల్‌ను పదే పదే ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు కాబట్టి థెరపీ కొనసాగిస్తే చాలా ఏళ్లు ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉందని వివరించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని తెలిపారు.
ఫార్మా కంపెనీ క్రిస్టల్ బయోటెక్ మార్కెట్ ఆమోదం కోసం ఇప్పటికే US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)తో కలిసి పని చేస్తోంది. 2023 మొదటి త్రైమాసికంలో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
READ MORE
బెర్లిన్ హిస్టరీ.. ఆడియో గైడ్ ద్వారా ప్రచారం చేస్తున్న సెక్స్ వర్కర్స్