20 ఏళ్లుగా పనిచేయకపోయినా.. నాకెందుకు జీతం ఇస్తున్నారని కంపెనీ మీద కేసు వేసిన మహిళ
సాధారణంగా పని చేయకుండానే జీతమిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు జనాలు. అదే జరిగితే లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని ఫీల్ అయిపోతుంటారు. ఆ మరుక్షణమే కలలో కూడా ఇది సాధ్యం కాదులే అని
దిశ, ఫీచర్స్: సాధారణంగా పని చేయకుండానే జీతమిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు జనాలు. అదే జరిగితే లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని ఫీల్ అయిపోతుంటారు. ఆ మరుక్షణమే కలలో కూడా ఇది సాధ్యం కాదులే అని ప్రాక్టికల్ గా ఉంటారు. అయితే ఫ్రాన్స్ లోని ఓ మహిళకు మాత్రం ఇదంతా సాధ్యమైంది. కానీ తనకెందుకు పని ఇవ్వకుండా శాలరీ ఇస్తున్నారని కంపెనీపై కేసు వేసింది.
ఆరెంజ్ కంపెనీని టేకోవర్ చేయడానికి ముందు 1993లో వికలాంగురాలు అయిన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్‌ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆమె శరీరం పక్షవాతంతో ఒక వైపు పూర్తిగా కదలలేని పరిస్థితిలో ఉంది. పైగా తను మూర్ఛతో బాధపడుతుంది . అందుకే ఆమెకు తగిన పని ఆఫర్ చేసింది యాజమాన్యం. 2002 వరకు హ్యూమన్ రిసోర్స్ లో కార్యదర్శిగా పని చేసిన ఆమె... తర్వాత ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ కావాలని కోరింది. కానీ తన కొత్త వర్క్‌ప్లేస్ తగినట్లుగా లేదని చెప్పింది. అయినా ఆరెంజ్ ఎటువంటి సర్దుబాట్లు చేయడానికి ముందుకు రాలేదు.
ఎలాంటి పని చేయకపోయినా 20ఏళ్లుగా
పూర్తి జీతం ఇస్తుంది.