Women’s safety.. ఆత్మరక్షణ కోసం మహిళలు వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులివే..
ఇటీవల ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ పదహారేళ్ల బాలికను ఓ వ్యక్తి పొడిచి చంపాడు. ఇదొక్కటే కాదు.. ఇలా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.
దిశ, ఫీచర్స్: ఇటీవల ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ పదహారేళ్ల బాలికను ఓ వ్యక్తి పొడిచి చంపాడు. ఇదొక్కటే కాదు.. ఇలా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2021లో 21శాతం మంది భారతీయ మహిళలు దాడికి గురయ్యారు. దీంతో వ్యక్తిగత భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. వీటి నివారణకు సమాజంలో రావాల్సిన మార్పు, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలు దోహదం చేస్తాయి. అదే సందర్భంలో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా మహిళలు తమకు తాము కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
పెప్పర్ స్ప్రే
ఇప్పటి వరకు మహిళలకు అత్యంత విశ్వసనీయమైన ఆత్మరక్షణ సాధనం పెప్పర్ స్ప్రే. అందుకే ఎక్కడికి వెళ్లినా దీనిని మీతో తీసుకెళ్లండి. ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే దీనిని సరిగ్గా, సరైన దిశలో పిచికారీ చేయండి. ఒక పెప్పర్ స్ప్రే ధర రూ. 150 నుంచి రూ. 250 వరకు ఉండవచ్చు.
విజిల్
మీరు రోడ్డుపై లేదా కాలనీల్లో నడుచుకుంటూ వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎవరూ బయట కనిపించరు. ఆ సందర్భంలో ఆగంతకులు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆ పరిస్థితిలో వెంటనే విజిల్ తీసి బిగ్గరగా ఊదండి. ఇది చుట్టుపక్కల ప్రాంతాలవారి దృష్టిని ఆకర్షిస్తుంది. సహాయం కోసం కాల్ చేయడాన్ని సులభతరం చేస్తుంది లేదా నేరస్థుడిని భయపెట్టవచ్చు. మీకు సహాయం చేయడానికి నలుగురు గుమిగూడే అవకాశం ఉంటుంది.
పాయింటెడ్ రింగ్స్
స్త్రీలు ధరించే యాక్సెసరీస్ కూడా ఆపద సమయాల్లో ఆయుధంగా ఉపయోగపడతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు ఇతరులపై ప్రయోగిస్తే నొప్పిని కలిగించేంత పదునైన ఉంగరాన్ని ధరించండి. అయితే ఈ ప్రక్రియలో మీకు మీరే హాని కలిగించుకోకుండా చూసుకోండి.
GPS ట్రాకర్
ఇది నిజంగా ఆయుధం కానప్పటికీ మీ లైవ్ లొకేషన్‌ను పేరెంట్స్ లేదా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం సేఫ్ హాబీగా చెప్పవచ్చు. ప్రత్యేకించి మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్ననప్పుడు, ప్రయాణంలో ఆలస్యం అయినప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళనను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. మీరు ఎప్పుడు, ఎక్కడ ఉన్నారనేది వారు తెలుసుకోగలుగుతారు.
చిన్న కత్తి
చాలా మంది మహిళలు తమ బ్యాగుల్లో ఉంచుకునేందుకు అనువైన ఆయుధం ఇది. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ జర్నీ రిస్క్‌తో కూడిందని భావిస్తే మీరు దీనిని బ్యాగులో పెట్టుకొని వెళ్లొచ్చు. మీ ఆత్మ రక్షణ కోసం ప్రమాదకర సందర్భంలోనే దానిని ఉపయోగించాలని నిర్ణయించుకోండి. నాలుగు అంగుళాల పొడవు, రెండు అంగుళాల కంటే తక్కువ వెడల్పు ఉన్న కత్తిని ఉపయోగించడం బెటర్.
షార్ప్ పెన్సిల్ లేదా ఇంక్ పెన్
మీరు పెన్సిల్, ఇంక్ పెన్ లేదా నెయిల్ ఫైలర్ వంటి ఏదైనా పాయింటెడ్ వస్తువును వెంట తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఎవరైనా మీపై దాడిచేసే క్రమంలో వీటితో ఎదురుదాడి చేయవచ్చు. మీరు కారులోనో, ఒంటరిగా నడుచుకుంటూనో వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా వేధిస్తే ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఇతరులు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తాకడానికి ప్రయత్నించినప్పుడు, మీపై దాడికి యత్నించినప్పుడు వీటిని ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
తీవ్రమైన తలనొప్పి వేధిస్తోందా?.. బ్రెయిన్ ట్యూమర్ కూడా కావచ్చు !