ఆరోగ్యంగా ఉండాలంటే..35ఏళ్లు పైబడిన మహిళలు ఈ ఫుడ్ తినాల్సిందే!

పురుషులకన్నా మహిళలు ఆరోగ్యపరంగా చాలా వీక్ ఉంటారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వీరి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. అందువలన 35 ఏళ్ల వయసు పైబడిన మహిళలు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు

Update: 2024-02-05 03:54 GMT

దిశ, ఫీచర్స్ : పురుషులకన్నా మహిళలు ఆరోగ్యపరంగా చాలా వీక్ ఉంటారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వీరి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. అందువలన 35 ఏళ్ల వయసు పైబడిన మహిళలు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు వైద్యులు. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంట.ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవో ఇప్పుడు చూద్దాం.

మహిళల్లో వయసు పెరిగే కొద్దీ రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన వీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే చేపలు, బచ్చలి కూర, తృణధాన్యాలు తీసుకోవాలంట. అలాగే ఎముకలు బలంగా ఉండేందుకు క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం చాలా మందిని బాధిస్తున్న అతి పెద్ద సమస్య మలబద్ధకం. వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా ఉండదు. అందు వలన 35 ఏళ్లు పైబడిన మహిళలు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే ఫొలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, పుచ్చకాయ మొదలైన పండ్లు తీసుకోవడం మంచిదంట.

Tags:    

Similar News