క్రియేటివ్ జాబ్ సెర్చింగ్.. నైక్ సంస్థలో ఉద్యోగం కోసం సరికొత్త ప్రయత్నం

జాబ్ సెర్చింగ్‌లో రెజ్యూమ్ ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2022-09-28 04:56 GMT

దిశ, ఫీచర్స్ : జాబ్ సెర్చింగ్‌లో రెజ్యూమ్ ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభ్యర్థికి సంబంధించిన అత్యుత్తమ సామర్థ్యాలు, లక్షణాలను వివరించేది ఇదే. అయితే ఇటీవలి కాలంలో ఉద్యోగార్థులు తమ రెజ్యూమ్ ప్రిపరేషన్‌కు క్రియేటివిటీని జోడిస్తూ రిక్రూటర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ విషయంలో తాజాగా ఒక మహిళ చూపించిన క్రియేటివ్ స్కిల్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. తన రెజ్యూమ్‌ను ఏకంగా కేక్‌పై ముద్రించి నేరుగా ఎంప్లాయర్‌కు పంపింది. ఇంతకీ ఆమెకు ఉద్యోగం వచ్చిందా? రాలేదా? తెలుసుకుందాం.

నైక్‌ సంస్థలో ఉద్యోగం పొందాలని నిశ్చయించుకున్న కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్.. అప్లికేషన్‌ను అధికారికంగా ఇమెయిల్‌కు పంపే బదులు ప్రత్యేకమైన రెజ్యూమ్‌ను పంపాలని నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన స్టోరీని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన కార్లీ.. 'వారు ప్రస్తుతానికి తమ టీమ్‌లో ఎటువంటి పొజిషన్స్‌కు రిక్రూట్ చేసుకోవడం లేదు. కానీ ఆ టీమ్‌కు నేను ఎవరో తెలపడానికి కొత్త మార్గాన్ని కనుగొనాలనుకున్నాను.

అందుకే ఓ పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మంచి మార్గం ఏముంటుందని ఆలోచనలో పడ్డాను. అలా ఆ టీమ్ పార్టీకి(నేను ఆహ్వానించబడలేదు) డెలివరీ చేసిన కేక్ పైన తినదగిన రెజ్యూమ్‌ను ఎలా సృష్టించగలమో ప్రయత్నాలు మొదలుపెట్టాను' అని చెప్పింది. మొత్తానికి డెనిస్ బాల్డ్విన్ అనే మహిళ ద్వారా తన కేక్ రెజ్యూమ్‌ను సంబంధిత టీమ్ సభ్యులకు అందేలా డెలివరీ చేయగలిగింది.

ఇక సదరు మహిళకు ఉద్యోగం రానప్పటికీ.. ఆమె సృజనాత్మకత, సంకల్పం మాత్రం ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆకట్టుకోవడమే కాక ప్రేరణ కలిగించింది. ఈ ఇన్సిడెంట్‌పై స్పందించిన ఒక నెటిజన్.. 'గొప్ప ఆలోచన & కృషి! రిక్రూట్‌మెంట్ సిస్టమ్స్‌లో మార్పు రాకపోతే ప్రజలు తమ జాబ్ సెర్చింగ్‌లో గుర్తించబడేందుకు ఇటువంటి క్రియేటివ్ ఎఫర్ట్స్ వదిలిపెట్టరు' అని పేర్కొన్నాడు

Tags:    

Similar News