ఛీ.. ఛీ.. 23ఏళ్లుగా అదేపని.. టాయిలెట్ పేపర్ తింటూనే..

యూఎస్ చికాగోకు చెందిన 34 ఏళ్ల కేషా .. దాదాపు 23 సంవత్సరాలుగా టాయిలెట్ పేపర్ తింటూనే ఉంది.

Update: 2023-03-06 09:37 GMT

దిశ, ఫీచర్స్: యూఎస్ చికాగోకు చెందిన 34 ఏళ్ల కేషా .. దాదాపు 23 సంవత్సరాలుగా టాయిలెట్ పేపర్ తింటూనే ఉంది. అలాగని ఒకటో రెండో కాదు ప్రతిరోజూ 75 షీట్స్‌ను ఈజీగా లాగించేస్తుంది. ఈ వింత అడిక్షన్‌కు కారణం పేపర్ వినియోగానికి సంబంధించిన ‘జిలోఫాగియా’ అనే ఈటింగ్ డిజార్డర్ అని తెలిపింది. తన నాలుకపై టాయిలెట్ పేపర్‌ను ఉంచినప్పుడు అది కరిగిపోయే విధానం భలేగా ఉంటుందని, అందుకే ఈ అలవాటు మానలేకపోతున్నాని చెప్పింది.

ఆరో తరగతిలో అమ్మమ్మ, అత్తతో కలిసి వెళ్ళినప్పుడు తాను అనుభవించిన చిన్ననాటి గాయం నుంచి ఈ అడిక్షన్ వచ్చిందని నమ్ముతున్న ఆమె.. ఎక్కువ తింటే బాత్‌రూమ్‌కి వెళ్లడం కష్టం అవుతుందని, కడుపులో తిమ్మిర్లు వస్తాయని వివరించింది. కాగా కేషాను చూసిన ప్రతిసారి.. ఆమె చేతిలో టిష్యూ ఉంటుందని, దాన్ని వెనుక దాచడానికి ప్రయత్నిస్తుందని బాధపడింది తల్లి. లాక్కోవడానికి ప్రయత్నిస్తే మానసికంగా అనారోగ్యం పాలవుతుందనే సైలెంట్‌గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.


అయితే ఈ అలవాటుతో ఉదరం లోపల ప్రేగులు చీలిపోతే ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కచ్చితంగా శరీరాన్ని ప్రమాదంలో పడేస్తుందని, ఆ అలవాటు మానుకునేందుకు సైకలాజికల్‌ సపోర్ట్ అండ్ థెరపీ అవసరమని సూచించారు.  

ఇవి కూడా చదవండి : అధిక బరువు, హైబీపీని నియంత్రిస్తున్న చియా సీడ్స్


Similar News