పొగమంచుతో జాగ్రత్త!! శీతాకాలంలో ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్

శీతాకాలం పొగమంచుకు పర్యాయపదంగా మారింది. వింటర్ వచ్చిందటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేసినట్లే..

Update: 2022-12-11 04:17 GMT

దిశ, ఫీచర్స్: శీతాకాలం పొగమంచుకు పర్యాయపదంగా మారింది. వింటర్ వచ్చిందటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేసినట్లే. ముఖ్యంగా భారతదేశ వార్షిక వాయు కాలుష్యం పెరుగుదల ప్రజల ఊపిరితిత్తుల సమస్యలను మరింత పెంచుతోంది. శ్వాసకోశ సమస్యలతో మరణాల రేటు పెరుగుదలకు కారణమవుతోంది. ఈ క్రమంలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, ఊపిరితిత్తులను ఈ సమస్యల నుంచి రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

వ్యవసాయ గడ్డి కాల్చేయడం, బాణసంచా, వాహనాల ఉద్గారాలు, బయోమాస్ దహనం, నిర్మాణం, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్టేజ్ కాల్చడం వంటి కాలుష్య కారకాల సాధారణ మూలాల నుంచి వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యం తీవ్రమవుతుంది. ఇవన్నీ కలిసి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి పేలవమైన గాలికి ఎక్స్ పోజ్ కావడం వల్ల.. దగ్గు, ఛాతి నొప్పి, గొంతు చికాకు, నాసికా మార్గం నిరోధించడం, ఎర్రబడిన వాయుమార్గాలు, ఉబ్బసం లాంటి దుష్ప్రభావాలు ఏర్పడుతాయి.

IQAir ద్వారా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం.. న్యూఢిల్లీ వరుసగా నాలుగో సారి ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా నిలిచింది. అలాగే, సెంట్రల్ మరియు దక్షిణాసియాలోని 15 అత్యంత కాలుష్య నగరాల్లో భాతరదేశంలోనే 11 నగరాలు ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా వార్షిక అకాల మరణాల పరిధిని 7 మిలియన్లుగా అంచనా వేసింది. ఇవి పరిస్థితి తీవ్రతను ప్రతిబింబించే గణాంకాలు కాగా.. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

ఊపిరితిత్తుల రక్షణ ఎలా?

వాయు కాలుష్యం మానవ ఆరోగ్యానికి ప్రధాన పర్యావరణ ముప్పులలో ఒకటిగా పరిగణించబడుతుంది. పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు.. ప్రతీ ఒక్కరు పేలవమైన గాలి నాణ్యత సూచిక నుంచి రక్షించబడాలి. ఈ క్రమంలో వాయు కాలుష్యం దుష్ప్రభావాల నుంచి సురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని సూచనలు అందిస్తున్నారు.

1. వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించండి

ప్రతిరోజూ ఇంటి నుంచి బయటికి రావాల్సిన వ్యక్తికి పరిసర వాయు కాలుష్యం హానికరం. అందుకే వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. కలుషిత వాతావరణంలో బయటికి వెళ్లినట్లయితే, వాయు కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడానికి మాస్క్‌ని ఉపయోగించండి.

2. శారీరక శ్రమ

శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల కలుషితమైన గాలిని పీల్చడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలతో పోరాడే శక్తి పెరుగుతుంది. తరుచుగా శ్వాస వ్యాయామాలు, యోగా.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. గాలి నాణ్యత సూచిక తక్కువగా ఉన్నప్పుడు, మీరు ఆరుబయట కంటే ఇంటి లోపల వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులతో మీ శరీరం కాలుష్య కారకాలతో మెరుగ్గా పోరాడగలుగుతుంది.

3. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి

శరీరంలో గాలి మార్పిడికి కేంద్రంగా ఉన్న ఊపిరితిత్తులు మనిషి ఆరోగ్య శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తాయి. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం.. సంభావ్య హానికరమైన పదార్థాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అందువల్ల కాలుష్య కారకాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు సాంప్రదాయ ఔషధం అద్భుతాలను అన్వేషించడం ప్రయోజనకరంగా ఉంటుంది. గొంతు చికాకు, పొడి దగ్గుతో పోరాడేందుకు.. తులసి, ములేతి, అమల్టాస్, ఉన్నాబ్, సప్లస్తాన్ వంటి సహజ మూలికలను ఉపయోగించండి. ఇవి శ్వాసనాళాలను స్పష్టంగా ఉంచడం ద్వారా ఊపిరితిత్తులపై ఒత్తిడిని తగ్గించగలవు.

4. పొగాకు, పొగకు దూరంగా ఉండండి

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ ప్యాకెట్ కూడా మనకు ఈ మెసేజ్‌ను రిమైండ్ చేస్తుంది. కానీ ధూమపాన ప్రియులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. పైగా ఆస్తమా, క్రోనిక్ ఇన్‌ఫ్లమేటరీ ఊపిరితిత్తుల వ్యాధి (COPD) వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ధూమపానం చాలా ప్రమాదకరం. వాయు కాలుష్యం స్థాయి అధికంగా ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ పొగ కూడా ప్రమాదకరమే.

5. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది

ప్రాథమిక పరిశుభ్రత కమాండ్‌మెంట్‌లను అనుసరించడం వల్ల ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం తగ్గుతుంది. సూక్ష్మక్రిములు నేరుగా లేదా పరోక్షంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయి. అందుకే మీ చేతులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. దగ్గు, జలుబు లేదా ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉండండి. హైడ్రేటెడ్‌గా ఉంటూ ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను తీసుకోండి.  

Also Read.....

మహానగరంలో శబ్ధ కాలుష్యం డేంజర్ బెల్స్.. 

Tags:    

Similar News