Sexual :సెక్సువల్ పార్ట్నర్స్ మధ్య స్పార్క్ ఎలా పెంచుకోవాలి?
దిశ, ఫీచర్స్ : సెక్సువల్ రిలేషన్షిప్ కొత్తలో మనసంతా సరికొత్త ఫీలింగ్‌తో గిలిగింత పెడుతుంది.
దిశ, ఫీచర్స్ : సెక్సువల్ రిలేషన్షిప్ కొత్తలో మనసంతా సరికొత్త ఫీలింగ్‌తో గిలిగింత పెడుతుంది. భాగస్వామిని క్షణమైనా విడిచి ఉండలేరు. అంతేనా కొద్దిపాటి విరహంలోనే వందల కొద్దీ చిలిపి సందేశాలతో సావాసం.. దరిచేరగానే బిగి కౌగిలిలో బంధించి కురిపించే ముద్దుల వర్షం.. ఇలా ఒకరికొకరు ఆరాధన కురిపించుకున్నవారే, తమ మధ్య గాలికైనా చోటివ్వనివారే.. సమయం గడిచేకొద్దీ ఆకర్షణ కోల్పోతారు. సెక్స్ పట్ల విముఖత చూపిస్తారు. ఇంతకీ జంటల మధ్య స్పార్క్ ఎందుకు తగ్గుతుంది? నిపుణులు ఏం చెప్తున్నారు?
* స్నేహపూర్వక వాతావరణం లేకపోవడం
శృంగార జంటల మధ్య స్పార్క్ కోల్పోయేందుకు ప్రధాన కారకాల్లో పార్ట్నర్తో నిజాయితీగా మాట్లాడకపోవడం ఒకటి. మనం హృదయపూర్వకంగా మాట్లాడకపోయినా భాగస్వాములే సమస్యను అర్థం చేసుకుని, పరిష్కరిస్తారని ఆశిస్తుంటాం. కానీ రియాలిటీ అలా ఉండదని.. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సంబంధాన్ని కొనసాగించాలంటే ప్రతి విషయంలో నిజాయితీతో కూడిన సంభాషణను కలిగి ఉండటం ముఖ్యమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సెక్స్ రిలేషన్లో స్నేహమే చాలా ముఖ్యమైన భాగం అంటున్నారు.
* శారీరక సాన్నిహిత్యం
ఆరోగ్యకరమైన సంబంధంలో లైంగిక సాన్నిహిత్యం చాలా ముఖ్యమైన భాగం. శారీరక సాన్నిహిత్యం ఎంత అవసరమో భావోద్వేగపరమైన అనుబంధం కూడా అంతే అవసరం. ఒకవేళ పార్ట్నర్తో సెక్స్ ఉత్సాహం కలిగించకపోతే.. అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఇద్దరు కలిసి సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. అంతేకాదు బెడ్ రూమ్‌లో టాయ్స్, పొజిషన్స్, మ్యూజిక్‌తో ప్రయోగాలు చేయొచ్చు. ఈ విధంగా భాగస్వామితో కనెక్ట్ అయితే స్పార్క్‌ను సజీవంగా ఉంచగలరు.
* గ్రాటిట్యూడ్
చాలాకాలం కలిసున్న తర్వాత సహజంగానే భాగస్వాములు ఒకరినొకరు లైట్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇలాంటి ఫీలింగ్స్ అనుభవిస్తుంటే.. గతంలో ఏవిధంగా రొమాంటిక్ మెసేజెస్ పంపుకునేవారో, ఒకరినొకరు మృదువుగా ఎలా హత్తుకునేవారో గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ భాగస్వామి పట్ల కృతజ్ఞతా భావాన్ని చూపించే మార్గాలు. కాబట్టి పార్ట్నర్కు ఎంత ఎక్కువ కృతజ్ఞత ఇస్తే, ప్రతిఫలంగా అంత ఎక్కువ స్వీకరిస్తారు. అంతేకాదు రిలేషన్షిప్లో వారి ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ తరచూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దీన్ని బహుమతుల రూపంలోనూ తెలియజేయొచ్చు.
Also Read : వారానికి 2 సార్లు సెక్స్ చేస్తే మగాళ్లకు మాత్రమే కలిగే లాభం..?!
Also Read : పెళ్లికి ముందే సెక్స్ (SEX).. భారత యువత ఏం అనుకుంటుందో తెలిస్తే షాక్