దంపతుల మధ్య ఏజ్‌ గ్యాప్ ఉండకూడదని ఎందుకు అంటారు?.. కారణం ఇదే!

మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?.. అయితే వయస్సుకు తగిన జోడీని చూసుకోండని సలహా ఇస్తుంటారు పెద్దలు. రెండు మూడేండ్లు అయితే పర్లేదు కానీ.. అంతకు మించినా, తగ్గినా మంచిది కాదని కూడా కొందరు చెప్తుంటారు.

Update: 2024-07-05 13:44 GMT

దిశ, ఫీచర్స్ : మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?.. అయితే వయస్సుకు తగిన జోడీని చూసుకోండని సలహా ఇస్తుంటారు పెద్దలు. రెండు మూడేండ్లు అయితే పర్లేదు కానీ.. అంతకు మించినా, తగ్గినా మంచిది కాదని కూడా కొందరు చెప్తుంటారు. కాగా ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునేవారు కూడా ప్రస్తుతం చాలామందే ఉంటున్నారు. సెలబ్రిటీల్లో ఈ తరహా రిలేషన్‌షిప్ ఎక్కువనే చెప్పాలి. ఒక అవగాహనతో ఉన్నప్పుడు సమస్యలు రాకపోవచ్చు కానీ.. సాధారణంగా ఏజ్‌గ్యాప్ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే చాన్సెస్ ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ స్టడీ ప్రకారం.. మరీ ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉన్న స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే వారి లైంగిక జీవితం సంతృప్తిగా ఉండకపోవచ్చు. మహిళలు ఎక్కవ వయస్సు కలిగి ఉన్నప్పుడు వారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ లోపంవల్ల సెక్స్ కోరికలు తగ్గుతాయి. దీంతో ఎక్కువ ఏజ్ ఉన్న స్త్రీని, తక్కువ ఏజ్ ఉన్న పురుషుడు పెళ్లి చేసుకుంటే భార్యా భర్తల మధ్య తగాదాలు ఏర్పడవచ్చు. అలాగే పురుషుడికి ఎక్కువ వయస్సు ఉన్న పురుషుడిని, తక్కువ ఏజ్ కలిగిన స్త్రీ పెళ్లి చేసుకోవడంవల్ల కూడా సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ పురుషుడిలో లైంగిక సామర్థ్యం తగ్గడం, లిబిడో వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి భార్య భర్తల బంధంలో వివాదాలు తలెత్తవచ్చు. అలాగే సమానమైన వయస్సులేకపోతే పరస్పరం అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్‌లో తేడాలు ఉండే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు.


Similar News