పండ్లను కాగితంలో చుట్టి ఉంచడానికి కారణమేంటి? 99% మందికి తెలియని రహస్యాలు?

ఎలాంటి అనారోగ్యానికి గురైన డాక్టర్లు ముందుగా పండ్లను తినమని చెబుతారు.

Update: 2024-10-02 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి అనారోగ్యానికి గురైన డాక్టర్లు ముందుగా పండ్లను తినమని చెబుతారు. ఎందుకంటే ఫ్రూట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనం కొనడానికి వెళ్లినప్పుడు అక్కడ పండ్లను బాక్సులో పెట్టి పేపర్ లో చుట్టి ఉంచడం అందరూ గమనించే ఉంటారు. మరీ అలా ఎందుకు ఉంచుతారని చాలా మందిలో డౌట్స్ తలెత్తే ఉంటాయి. ఎక్కువగా అయితే మామిడి, బొప్పాయి వంటి పండ్లు పేపర్‌లో చుట్టి ఉండటాన్ని గమనించవచ్చు. మరీ కాగితంలో ఫ్రూట్స్ ను ఎందుకు చుట్టి ఉంచుతారో ఇప్పుడు చూద్దాం..

పలు ఫ్రూట్స్‌లో ఇథిలీన్ వాయువు ఉంటుంది. కాగా పండ్ల నుంచి రిలీజ్ అయ్యే వాయువులను నియంత్రించడానికి కాగితం ఎంతో మేలు చేస్తుంది. పైగా పేపర్ లో ఉండే ఫ్రూట్స్ తాజాగా ఉంటాయి. తేమగా ఉంచడంతో పాటు త్వరగా పండటానికి మేలు చేస్తాయి. అలాగే ప్యాకింగ్ చేయకపోతే డైరెక్ట్ పెట్టలో పెడితే పెట్టకు తగిలి తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కాగితం పండ్లను సున్నితంగా ఉంచడమే కాకుండా రక్షణ కల్పిస్తాయి. అలాగే పేపర్ లో చుట్టి పెట్టడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News