చిన్న పిల్లల్లో జాండీస్ ఎందుకు వస్తాయి.. అవి ఎప్పుడు ప్రమాదమంటే?
తల్లి అవ్వడం గొప్ప వరం. తొమ్మిది నెలలు మోసి, కొద్ది క్షణాల్లో తన ప్రతి రూపం బయటకు రాబోతుంది అనే ఆనందం మాటల్లో చెప్పలేనిది. దాని ముందు ప్రసవ నొప్పులనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి.
దిశ, ఫీచర్స్ : తల్లి అవ్వడం గొప్ప వరం. తొమ్మిది నెలలు మోసి, కొద్ది క్షణాల్లో తన ప్రతి రూపం బయటకు రాబోతుంది అనే ఆనందం మాటల్లో చెప్పలేనిది. దాని ముందు ప్రసవ నొప్పులనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి. తన బుజ్జి పాప కోసం ఆ అమ్మ ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇక ప్రసవం అనంతరం తన కన్నబిడ్డను చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆ తల్లి ఆనందం మాటల్లో చెప్పలేనిది. అందుకే అంటారు పెద్దలు, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సంతోషం ఎక్కడా దొరకదు, ఇక పుట్టిన తర్వాత ఆ పసికందును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇక పుట్టిన శిశువులకు కామెర్లు రావడం అనేది చాలా కామన్. పుట్టిన వెంటనే దాదాపు 70 శాతం మంది పిల్లలు కామెర్ల బారిన పడతారు. అయితే కొందరిలో ఇవి పుట్టిన వెంటనే కనిపిస్తే, మరి కొందరిలో మూడో రోజుకు జాండీస్ లక్షణాలు కనిపిస్తాయి.దీంతో కొంతమంది తల్లిదండ్రులు తెగ హైరానా పడిపోతుంటారు. పాపాను ఎండలోకి తీసుకెళ్లి చూపెట్టడం లాంటిది చేస్తారు. అయితే పుట్టుకతో వచ్చే కామెర్లు అంత ప్రమాదకరం కాదు అంటున్నారు వైద్యులు.
పెద్దల్లో కనిపించే కామెర్లకు పిల్లల్లో వచ్చే కామెర్ల కి అసలు సంబంధం ఉండదంట. పిల్లలకు వచ్చే కామెర్లకు కాలేయానికి ఎలాంటి సంబంధం ఉండదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకి ఎక్కువ రక్త కణాలు అవసరం అవుతాయి, పుట్టిన తర్వాత పసికందుకు వాటి అవసరం ఉండదు.అందువలన ఆ కణాల విచ్చిన్న అయ్యేటప్పుడు కామెర్లు వస్తాయంట. అలాగే ముఖ్యంగా తల్లి తగినంత నీరు తీసుకోకపోవడం, బిడ్డకు తగినంత పాలు పట్టకపోవడం.. దీనివల్ల బిడ్డ డీహైడ్రేట్ అవుతుంది. పేగు కదలిక తగినంతగా ఉండకపోవడంతో, బిలిరుబిన్ విసర్జన తగ్గి కామెర్లు వస్తాయంట. అలాగే పిత్తాశయం సమస్యలు వచ్చినప్పుడు లేదంటే కాలేయం నుంచి ప్రేగులకు బిలిరుబిన్ ను తీసుకువెళ్లే గొట్టమైన పిత్తవాహికలో బ్లాకేజస్ ఏర్పడినప్పుడు కామెర్లు వస్తాయి. ఇలాంటి కామెర్లు వచ్చినప్పుడు జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం యూరిన్ డార్క్ గా రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా పిల్లలకు కామెర్లు రావడానికి ప్రధాన కారణం..తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి, బిడ్డది పాజిటివ్ ఉన్నప్పుడు. ఆ బిడ్డకు కామెర్లు తీవ్రస్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందంట. అయితే పిల్లల్లో కామెర్లు వచ్చినప్పుడు శరీరం పచ్చ రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో, వారు ఫోటో థెరపీ లైట్స్ కింద ఎక్కువ రోజులు పెట్టి గమనిస్తారు.మాములుగా అయితే జాండీస్ అనేవి పిల్లలో వచ్చి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఇవి వారం రోజులకంటే ఎక్కువగా ఉంటే మాత్రం ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. దీంతో అలాంటి పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయం అందించి, ఎప్పటికప్పుడు వైద్యుడి పర్యవేక్షణలో ఉంచాలంట.
Read More..
సమ్మర్ స్పెషల్ : చల్ల చల్లని బాదం మిల్క్ ఇంట్లోనే ఇలా తయారు చేయండి!