బైక్, కార్ల వెనుక కుక్కలు ఎందుకు పరుగెత్తుతాయి.. ఇది దేనికి సంకేతమో తెలిస్తే షాకవ్వాల్సిందే
కుక్కలు సాధారణంగా సైకిళ్లు, కార్లు , కదిలే వాహనాల వెనుక పరుగెత్తుతాయి.
దిశ, ఫీచర్స్ : కుక్కలు సాధారణంగా సైకిళ్లు, కార్లు , కదిలే వాహనాల వెనుక పరుగెత్తుతాయి. దీని వలన ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇది దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకుందాం..
కుక్కలు సాధారణంగా మనుషులతో స్నేహంగా ఉంటాయి. కానీ అకస్మాత్తుగా కార్ల వెనుక చాలాసార్లు కుక్కలు తన శక్తినంతా ఉపయోగించి కార్ల వెనుక పరుగెడుతుంటాయి. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనుషుల మీద కోపంతో కాదని, మీ యొక్క టైర్లపై వాసన వదిలిన ఇతర కుక్కల కోసం అలా చేస్తాయని అంటున్నారు. ఎలాంటి వాసనైన కుక్కలు ఇట్టే పసిగట్టగలవు. అవి తమ పదునైన ముక్కుతో మరొక కుక్క వాసనను వెంటనే గుర్తిస్తాయని చెబుతున్నారు. దీని వలన ఎలాంటి చెడు జరగదని.. ఇంకా చెప్పాలంటే శుభంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తేల్చి చెప్పేసారు.
మీ టైర్లపై సువాసనను వదిలిన మరొక కుక్క వాసనను చూస్తుంది. ఈ వాసన మీ కారు వెనుక కుక్క మొరిగేలా చేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో, చాలా మంది భయాందోళనలకు గురవుతారు. దీంతో వారి కారు లేదా మోటార్ సైకిల్‌ను అధిక వేగంతో నడుపుతారు. అలాంటి క్షణాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా, ప్రజలందరూ ఈ సమస్యతో ఎక్కువ స్థాయిలో బాధపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో అలసిపోకుండా తెలివిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Read more : కుక్కలు కారు టైర్లు, గోడల పైనే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?.. షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు