చాలా దేశాల పేర్లలో ''స్థాన్' ఎందుకు ఉంటుంది.. ఈ పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందామా..

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేశానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి.

Update: 2024-09-06 07:25 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేశానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. కానీ పేర్లలో ఒక పదం కామన్ గా ఉంటుంది. ఆ పదమే స్తాన్,. ఈ పదంతో ముగిసే దేశాలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైనవి. ఇంతకీ ఈ పదానికి అర్థం ఏమిటి, దేశాల పేర్లలో దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు, అని ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Quoraలో ఆసక్తికరమైన ప్రశ్నలను అడుగుతుంటారు. అలాగే కొంతకాలం క్రితం ఎవరో ఇలాంటి ప్రశ్న అడిగారు. అనేక దేశాల పేర్ల వెనుక స్తాన్ అని ఎందుకు ఉంటుంది అని. దీని పై చాలా మంది స్పందించారు. అయితే ఈ సమాధానాలు సరైనవి కానవసరం లేదు ఎందుకంటే అవి సాధారణ ప్రజలే ఇస్తున్నారు.

ప్రజలు Quora లో ఇచ్చిన సమాధానాలు..

జాన్ బ్యాంక్స్ అనే వినియోగదారు Quora లో చాలా దేశాలకు చివరిలో ల్యాండ్ అనే పదం జతచేయబడినట్లే, అదే విధంగా స్తాన్ అనే పదం కూడా జతచేశారని చెప్పారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, పోలాండ్ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణలు. స్టీవ్ ర్యాప్పోర్ట్ అనే వినియోగదారు స్తాన్ అనే పదం పర్షియన్ అని, అంటే స్థలం లేదా ఒకరి ప్రదేశం అని అర్థం. ఉదాహరణకు ఆఫ్ఘన్ ప్రజలు నివసించే ప్రదేశాన్ని లేదా ఆఫ్ఘన్‌ల ప్రదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ అంటారు. 'స్తాన్' అనే పదం 'స్థాన్' అనే సంస్కృత పదం నుండి ఉద్భవించిందని చెబుతారు.

పర్షియన్ పదం 'స్తాన్'

సాధారణ ప్రజల సమాధానాలు, దాని గురించి విశ్వసనీయ వర్గాలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ జ్ఞానానికి సంబంధించిన వెబ్‌సైట్ అయిన బ్రిటానికా ప్రకారం ఇస్తాన్ లేదా స్తాన్ అనే పదానికి నిర్దిష్ట విషయానికి సంబంధించిన స్థలం లేదా ప్రజలు ఉండే ప్రదేశం అని అర్థం. ఇది పర్షియన్ పదం. దీని ప్రకారం, తజికిస్తాన్ అంటే తజిక్‌ల భూమి, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘన్ల దేశం అని అర్థం వస్తుందట.


Similar News