‘లెగ్గింగ్ లెగ్స్’ ట్రెండ్‌.. సన్నకాళ్ల అమ్మాయిలే బాగుంటారా ?

ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక ఏ విషయం ఎవరిని ఆకట్టుకుంటుందో, ఏ రోజు ఏ అంశం ట్రెండింగ్‌లో ఉంటుందో ఊహించలేం.

Update: 2024-02-01 11:13 GMT

దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక ఏ విషయం ఎవరిని ఆకట్టుకుంటుందో, ఏ రోజు ఏ అంశం ట్రెండింగ్‌లో ఉంటుందో ఊహించలేం. ఇందులో ట్రెండ్ ఫాలోవర్స్‌తోపాటు ట్రెండ్ సెట్టర్స్ వరకు అనేకమంది తన ఆలోచనలను పంచుకుంటారు. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లుగా, సెలబ్రిటీలుగా మారి ఇతరులను ప్రభావితం చేస్తుంటారు. కొన్ని పోకడలు యువతకు మేలు చేస్తుండగా, మరికొన్ని వారిలో రుగ్మతలకు, ప్రతికూల ప్రభావాలకు కారణం అవుతున్నాయి. రీసెంట్‌గా ‘లెగ్గింగ్ లెగ్స్’ అనే ఒక సరికొత్త ట్రెండ్ టిక్‌టాక్ సహాలు పలు సోషల్ మీడియా వేదికల్లో చర్చనీయాంశం అవుతోంది.

అందంగా కనిపిస్తారా?

థిన్ లెగ్స్ (సన్నటి కాళ్లు ) కలిగిన అమ్మాయిలే లెగ్గింగ్స్‌లో అందంగా కనిపిస్తారనే ఆలోచనను ప్రోత్సహించే సరికొత్త ధోరణే ‘లెగ్గింగ్ లెగ్ ట్రెండ్’ ఇటీవల సోషల్ మీడియాలో కొందరు దీనిని బాగా ప్రచారం చేస్తుండగా, ఎంతో మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారు. ఇక సన్నని కాళ్లు యువతులు ఇటువంటి పోస్టింగులు చూసి మురిసిపోతుంటే, అలా లేనివాళ్లు పెదవి విరుస్తున్నారు. కొందరు తాము అలా లేనందుకు ‘నెగెటివ్ బాడీ ఇమేజింగ్’ ఆలోచనలతో బాధపడుతున్నారని కూడా నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ ట్రెండ్ ఎంత పాపులర్ అయిందో ఇటీవల అంత వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ప్రస్తుతం లెగ్గింగ్ లెక్స్ ట్రెండ్‌ను పలువురు విమర్శిస్తు్న్నారు.

ఎలా ప్రారంభమైంది?

కొంతకాలం క్రితం టిక్‌టాక్‌లో సెఫోరా జనరేషన్ పేరుతో కొందరు యువతులు తమ సన్నటి లేదా పొడవాటి కాళ్లను ప్రదర్శిస్తూ “లెగ్గింగ్ లెగ్స్” క్యాప్షన్‌తో ప్రచారం చేశారు. ఎంతైనా ‘‘థిన్ లెగ్స్’ స్టైలే వేరు. ఇలా ఉంటేనే అమ్మాయిలు అందంగా ఉంటారు’’ అంటూ ఫొటోలు, రీల్స్ షేర్ చేశారు. ఇవి కాస్త వైరల్ కంటెంట్‌గా మొత్తం సోషల్ మీడియాను ఆవహించేసింది. ఇటీవల ఒక పారిస్ అమ్మాయి ఇది చూసి తనకు సన్నటి కాళ్లు లేకపోవడంవల్ల ‘నా జీవితంలో ఏదీ సరైంది కాదు’ అని నిరాశ వ్యక్తం చేసింది. అంతేకాదు #anorexi4, #an0rex1c #sk1nny తదితర హాష్ టాగ్‌లతో ఉన్న ‘లెగ్గింగ్ లెగ్స్’ ట్రెండింగ్స్ ఎంతోమందిలో బాడీ ఇమేజింగ్ డిజార్డర్స్‌కు, డిప్రెషన్‌కు కారణం అయినట్లు నిపుణులు చెప్తున్నారు.

వ్యతిరేకతకు కారణం..

లెగ్గింగ్ లెగ్స్ ట్రెండ్ కొందరు యువతులను నిరాశకు గురిచేస్తోది. పైగా అదొక బాడీ ఇమేజింగ్ టాక్సిక్ బిహేవియర్‌గా మారుతుండటం ఇటీవల మహిళలను, యువతులను ఆలోచింపజేస్తోంది. సామాజిక స్పృహ కలిగినవారు ఈ నయా ట్రెండును బద్దలు కొట్టానికి నడుం బిగించారు. ముఖ్యంగా మిలీనియల్స్ అండ్ ఓల్డర్ జెన్ జెర్స్ ఇదొక ప్రమాదకర ధోరణిగా పేర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగానే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ‘‘సన్నని కాళ్లే అందం’ అంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? ఇది ప్రమాదకరమే కాకుండా ఇతరులను అవమానించడం కూడా’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది సోషల్ మీడియా కన్సల్టెంట్ అండ్ కంటెంట్ క్రియేటర్ ఎమిలీ పర్ల్. ‘లెగ్గింగ్ లెగ్స్’ లేకపోతే లెగ్గింగ్స్ ధరించలేమని భావించిన 15 ఏళ్ల అమ్మాయిలు ప్రతిరోజూ ఇప్పుడు లెగ్గింగ్స్ ధరిస్తున్నారిదిగో’ అంటూ కొందరు ‘థిన్ లెగ్స్’ ట్రెండ్‌ను వ్యతిరేకిస్తున్నారు.


Similar News