మార్నింగ్ లేవగానే మీ యూరిన్ రంగు ఇలా ఉంటే ప్రమాదమే.. కారణాలు-నివారణ?
మూత్రవసర్జన చేయడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి.
దిశ, ఫీచర్స్: మూత్రవసర్జన చేయడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి. ప్రతిరోజూ 3 నుంచి 7 సార్లు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది పదే పదే టాయిలెట్ వెళ్తుంటారు. మరికొంతమంది తక్కువ సార్లు యూరిన్ చేస్తారు. కాగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. బాడీకి తగినంత వాటర్ ఉంటేనే వ్యక్తి హెల్తీగా ఉంటాడు. లేకపోతే డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరతాయి. ఇకపోతే మన ఆరోగ్యంలో టాయిలెట్ కలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమంది ఉదయం పసుపు కలర్‌లో యూరిన్ చేస్తారు. కాగా పసుపు రంగులో మూత్రం వచ్చినట్లైతే పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సూచించినట్లని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మూత్రం ఇలా రావడానికి కారణాలు? నివారణ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కిడ్నిలో రాళ్లు ఏర్పడడం వల్ల ఉదయం పూట మూత్రం వెళ్లినప్పుడు పసుపు రంగులో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జననేంద్రియ ప్లేస్‌లో పెయిన్ అండ్ వాపు వస్తుందట. ముఖ్యంగా ఈ విషయంలో గర్భిణీ స్త్రీలలో ఇలాంటి ప్రాబ్లమ్ కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు పేగు సంబంధిత వ్యాధుల వల్ల మూత్రం పసుపు కలర్‌లో వస్తుందట. అలాగే శరీరంలో వాటర్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు యూరిన్ యల్లో కలర్ లో వస్తుంది.
నివారణ..
దాహం వేసినప్పుడే కాకుండా క్రమం తప్పకుండా వాటర్ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు. మార్నింగ్ పూట 1 లీటర్ వాటర్ తాగాలి. అన్నం తినే ముందు తప్పకుండా ఒక గ్లాస్ నీరు తాగాలి. ఎప్పుడైనా సరే భోజనం మధ్యలో వాటర్ తాగకూడాదు. తిన్నాక ఒక గంట తర్వాత తాగడం ఆరోగ్యానికి మేలు. అలాగే ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడాలంటే రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు తీసుకోవాలి. విటమిన్ సి ను ఆహారంలో చేర్చుకోవాలి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా జామపండ్లు, గ్రీన్ టీ, పెరుగు తీసుకోవడం వల్ల పసుపు రంగులో వచ్చే మూత్ర సమస్యకు చెక్ పెట్టొచ్చు. లేకపోతే వైద్యుల్ని సంప్రదించడం వల్ల కూడా సమస్యను దూరం చేసుకోవచ్చు.
గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.