భార్యాభర్తలు గొడవ పడినప్పుడు.. ఇలా చేస్తే మీ భాగస్వామి వదిలిపెట్టరు!

ఈ చిట్కాలు పాటించండి.. ఏ సమస్యలు రావు

Update: 2024-01-28 07:31 GMT

దిశ,ఫీచర్స్: ఈ రోజుల్లో చాలా మంది కపుల్స్ చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. ఓపిక తక్కువై గొడవలు పడుతున్నారు. దీంతో సంబంధాల్లో సర్దుకుపోవడం తెలియక జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చుకుంటున్నారు. అయితే, ఏ విషయంలోనైనా గొడవలు వచ్చినప్పుడు కాస్తా సహనంగా ఉంటే గొడవలు సద్దుమణుగుతాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమవుతుంటే.. ఈ చిట్కాలు పాటించండి.. ఏ సమస్యలు రావు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

చిన్న విషయాన్ని పెద్దది చేయకండి

మనకి నచ్చని పని మన ముందు జరుగుతుంటే.. కోపం రావడం సహజం. అయితే ఆ గొడవ కాస్తా కోపంగా మారితే పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి అలాంటప్పుడు భర్త శాంతంగా ఉండటమే లేక కొద్దీ సేపు మౌనంగా వుండడమో చేస్తే కొంత సమయానికి కోపం తగ్గిపోతుంది.

మాటలతో జాగ్రత్త

పోసిన నీళ్లను .. జారిన మాటలను వెనక్కి తీసుకోలేమంటారు. చాలా మంది వాదించేటప్పుడు మాటలను బాణాల్లా వదులుతారు. దీని వల్ల మీకే నష్టం కలుగుతుంది. ఎందుకంటే మీరు అనే మాటలు మీ భాగస్వామిని మరింత బాధించవచ్చు. మీ బంధం మంచిగా మారిన ప్రేమ మాత్రం తగ్గుతుంది.

ప్రవర్తన

ఇతరులు కోపంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఆ సమయంలో మాట్లాడకపోవడమే మంచిది. మీరిద్దరూ ఇలాగే మాట్లాడుకోవాలనుకుంటే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతుంది. కాబట్టి ఓపికగా ఉండండి.

ఓదార్చడం..

తన కోపం తనకే శత్రువు. కాబట్టి ఆ సమయంలో లిమిట్స్ దాటకండి. మీరు అరిచి ఒత్తిడిని పెంచుకోవద్దు.గొడవ పడిన కొంత సేపటి తర్వాత ఓదార్చడం మంచిది. మరి ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు మాటలని వదిలే బదులు ఆ పరిస్థితిలో దూరంగా వెళ్ళిపోవడం మంచిది.


Similar News