రోమన్స్ ఉపయోగించిన సెక్స్ టాయ్.. ముందుగా అలా అనుకున్నారు కానీ..
రోమన్స్ ఉపయోగించిన సెక్స్ టాయ్‌ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. రెండో శతాబ్దానికి చెందిన ఈ వస్తువును 1992లో హాడ్రియన్ వాల్ సమీపంలోని రోమన్ ఫోర్ట్ ఆఫ్ విండోలాండో వద్ద ఓ గుంటలో కనుగొన్నారు పరిశోధకులు..
దిశ, ఫీచర్స్: రోమన్స్ ఉపయోగించిన సెక్స్ టాయ్‌ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. రెండో శతాబ్దానికి చెందిన ఈ వస్తువును 1992లో హాడ్రియన్ వాల్ సమీపంలోని రోమన్ ఫోర్ట్ ఆఫ్ విండోలాండో వద్ద ఓ గుంటలో కనుగొన్నారు పరిశోధకులు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఉత్తర ఇంగ్లాండ్‌లోని రోమన్ సామ్రాజ్యపు వాయువ్య సరిహద్దుగా ఉండేది. అయితే ఈ వస్తువుపై గతంలో రీసెర్చ్ చేసిన సైంటిస్టులు.. డజన్ల కొద్దీ షూస్, దుస్తుల ఉపకరణాలతో పాటు లభించడంతో, క్లాత్స్ కుట్టేందుకు ఉపయోగించేవారని విశ్వసించారు. కానీ తాజాగా దీన్ని సెక్స్ టాయ్‌గా నిర్ధారించారు.
ఈ ఫాలస్ ఆకారపు(పెనిస్ మోడల్) సాధనం సెక్స్ టాయ్ అనే తాజా సిద్ధాంతం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఇది అదృష్ట చిహ్నం, గ్రైండింగ్ టూల్ అయుండొచ్చు కదా అని తోసిపుచ్చలేదన్న న్యూకాజిల్ యూనివర్శిటీ, యూనివర్శిటీ కాలేజ్ డబ్లిన్ పరిశోధకులు.. ఈ కళాఖండాన్ని విడదీయబడిన ఫాలస్‌గా అర్థం చేసుకున్నారు. దీని వల్ల సాధ్యమయ్యే కొన్ని విధులను వివరించారు. విండోలండో ఫాలస్ 16 సెంటీమీటర్ల పొడవుతో రెండు చివరలు చాలా మృదువుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. రెండు వేల ఏళ్ల క్రితం ఉపయోగించిన ఈ సెక్స్ టాయ్.. పదేపదే ఉపయోగించబడిందని సూచించింది.
Pegging: the Roman wayA roman sex toy from 2000 years ago pic.twitter.com/wqXH8zzNlu
— Stevie 🍁❤️🌈♀ 😷💉 (@Stevie_Ca) February 20, 2023