పెళ్లికి ముందే సెక్స్.. కాపురంలోకి ఎంటరవుతున్న మాజీ లవర్స్! మరి భాగస్వామితో సంసారం చేసేది ఎలా..?
ఇండియాలో డేటింగ్ కామన్ అయిపోయింది. రొమాంటిక్ రిలేషన్ అనేది సర్వసాధారణంగా మారింది.
దిశ, ఫీచర్స్: ఇండియాలో డేటింగ్ కామన్ అయిపోయింది. రొమాంటిక్ రిలేషన్ అనేది సర్వసాధారణంగా మారింది. ఇలాంటి బంధాల నుంచి బ్రేకప్ తర్వాత మరొకరితో రిలేషన్‌షిప్‌లోకి రావడం లేదా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇలా మొత్తానికి మ్యారేజ్‌కు ముందు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శృంగార సంబంధాలు కలిగి ఉంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అయితే కొందరు తమ ఎక్స్ నుంచి క్లీన్ బ్రేక్ తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం అసహ్యం, విరక్తితో ఆ బంధం నుంచి బయటపడుతారు. ఎలాగోలా కంఫర్ట్ జోన్‌లోకి వచ్చామని ఫీల్ అవుతారు. కానీ ఆ ఎక్స్ పెళ్లి తర్వాత మళ్లీ క్లోజ్ అయితే.. ఆ వివాహంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అలాంటి సందర్భాల్లో భాగస్వామి ఎలా డీల్ చేయాల్సి ఉంటుంది?
ఏదేమైనా తమ భర్త/భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటున్నారంటే బాగస్వాములు కచ్చితంగా అసౌకర్యంగా భావిస్తారు. ముఖ్యంగా ఆ వ్యక్తితో ఇంతకు ముందే రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్నారని తెలిస్తే.. పార్ట్‌నర్ ఎక్కడ చేజారిపోతారోనని మదనపడిపోతుంటారు. ఇలాంటి పరిస్థితే విమల అనే అమ్మాయికి వచ్చింది. పెళ్లి తర్వాత రెండేళ్లకు తన భర్త దేవ్‌తో కాంటాక్ట్‌లోకి వచ్చింది కాలేజ్ లవర్ నీలిమ. వారిద్దరు దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసి విడిపోయామరని పెళ్లికి ముందే విమలకు చెప్పాడు దేవ్.
అయితే అనుకోకుండా ఫ్యామిలీ గొడవలతో బాధపడుతున్న ఆమె.. భర్తతో మళ్లీ ఫ్రెండ్‌షిప్‌లోకి రావడం ముందుగా లైట్ తీసుకున్నా.. బెడ్ షీట్ సెలెక్ట్ చేయడం నుంచి ఫినాన్షియల్ సజెషన్స్ వరకు దాదాపు 70శాతం నిర్ణయాల్లో నీలిమపై భర్త ఆధారపడటాన్ని విమల తట్టుకోలేకపోయింది. ప్రతీ చిన్న విషయానికి కలుస్తుండటంతో నీలిమ ఇదంతా కావాలనే చేస్తుందనే అనుమానం వచ్చేలా చేసింది. దీంతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేయడం, గొడవ పడటం జరుగుతోంది.
ఇద్దరి మధ్య పెరుగుతున్న తగాదాలు.. భర్తపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసే స్థితికి తీసుకువచ్చాయి. ఇంత జరిగినా భార్య.. తన భర్తకు మాజీ ప్రియురాలిపై శృంగార భావాలు లేవని నమ్మింది. కానీ నీలిమ తన హజ్బెండ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుందని అనుకుంది. మొత్తానికి చాలా ప్రయత్నం, పోరాటంతో భర్తను ఎదుటివ్యక్తిపై ఆధారపడటాన్ని తగ్గించేలా చేసింది. కానీ మాజీ నుంచి భర్తను వెనక్కి తీసుకురాగలిగిందా లేదా కచ్చితంగా తెలుసుకోలేకపోయింది.
అంటే ఇక్కడ తన హజ్బెండ్ మాజీ ప్రియురాలు.. భర్త నుంచి రొమాంటిక్ రిలేషన్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదని అనిపిస్తే.. ఆ భాగస్వామి మరోలా ట్రీట్ చేసింది. తన యాక్సెప్టెన్స్, యాక్టివిటీస్ మరోలా ఉండేవి. ఆ స్నేహం గురించి ఆమెకు అభద్రతాభావం ఉండేది కాదు. ఇద్దరి నుంచి కాకపోయినా ఒకరి నుంచి ఇలాంటి భావాలు ఉన్నా.. ఎక్కువ శాతం కమిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఇక్కడ పార్ట్‌నర్ అసౌకర్యంగా, ఇన్‌సెక్యూర్‌గానే ఉండాల్సి వస్తుంది.
ఇలాంటి సందర్భాల్లో భార్యాభర్తలు ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇద్దరు భాగస్వాములు ఈ విషయంలో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాలని, మ్యూచువల్ కంఫర్ట్ లెవల్స్ కలిగి ఉండాలని చెప్తున్నారు. తమ మాజీలను స్నేహితులుగా కొనసాగించడంలో హజ్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికీ ఎలాంటి అసౌకర్యం లేనప్పుడు మాత్రమే ఆ స్నేహాన్ని కొనసాగించాలని అంటున్నారు. ఏదేమైనప్పటికీ.. మీ మాజీతో సాన్నిహిత్యం గురించి మీ భాగస్వామి బెంగ పడుతున్నట్లు అనిపిస్తే.. ‘మీ భాగస్వామి కంటే మీ మాజీతో ఉన్న సంబంధమే ముఖ్యమా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దానికి మీ మనసు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో దాన్ని ఫాలో అయిపోండి అంటున్నారు నిపుణులు.
Read more:
సమ్మర్ కధా అని నైటీలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?