వర్షంలో తడిసినా దగ్గు, జలుబు రాకూడదంటే ఏం చేయాలి?

అసలే రెయినింగ్ సీజన్. బయటకు వెళ్లినప్పుడు సడెన్‌గా వర్షం రావడంవల్లో, కొన్నిసార్లు గొడుగు మర్చిపోవడంవల్లో తడిసిపోయే అవకాశం ఉంటుంది. ఇక పిల్లలైతే వాన పడుతున్నప్పుడు సరదాగా ఆడుకోవాలని ఉత్సాహపడుతుంటారు.

Update: 2024-07-03 13:07 GMT

దిశ, ఫీచర్స్ : అసలే రెయినింగ్ సీజన్. బయటకు వెళ్లినప్పుడు సడెన్‌గా వర్షం రావడంవల్లో, కొన్నిసార్లు గొడుగు మర్చిపోవడంవల్లో తడిసిపోయే అవకాశం ఉంటుంది. ఇక పిల్లలైతే వాన పడుతున్నప్పుడు సరదాగా ఆడుకోవాలని ఉత్సాహపడుతుంటారు. పేరెంట్స్ వద్దని చెప్పినా వినకుండా నీటిలో ఆడుతుంటారు. ఇలాంటప్పుడు దగ్గు, జలుబు, జ్వరాలు వంటివి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకోసం తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే వర్షంలో తడుస్తు్న్నంత సేపు ఏమీ అనిపించదు. కానీ తర్వాత జలుబు, దగ్గు, ఫీవర్ వంటివి స్టార్టవుతాయి. అలా జరగకూడదంటే వర్షంలో నుంచి ఇంట్లోకి రాగానే టవల్‌తో మొత్తం శరీరంతోపాటు జుట్టును సరిగ్గా తుడవాలని నిపుణులు చెప్తున్నారు. హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగిస్తే మరీ మంచిది. దీనివల్ల తల వెంట్రుకల్లో తేమ పూర్తిగా ఆరిపోతుంది. జలుబు, తలనొప్పి, జ్వరం వంటివి రాకుండా నివారిస్తుంది.

* వానలో తడిసి వచ్చిన వెంటనే వేడినీటితో స్నానం చేయడంవల్ల ఆ పరిస్థితి బాడీ టెంపరేచర్‌ను సమతుల్యం చేస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా బయటి వాతావరణంలోంచి మీ శరీరంపైకి చేరిన బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు కూడా చనిపోతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి.

వేడి వేడి టీ లేదా డికాక్షన్ వంటివి తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో వర్షంలో తడిసిన వారు ఇది పాటిస్తే వైరల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు బారిన పడే అవకాశం తగ్గుతుందని, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News