లోషన్, మాయిశ్చరైజర్ మధ్య తేడా ఏమిటి.. ఏ సీజన్ లో దేన్ని వాడాలి..

చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్‌, లోషన్ ను చర్మానికి రాస్తూ ఉంటారు.

Update: 2024-09-20 05:19 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్‌, లోషన్ ను చర్మానికి రాస్తూ ఉంటారు. ఈ రెండూ చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. కానీ ఏ సీజన్ లో ఏది ఉపయోగించాలి అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా మంది మాయిశ్చరైజర్‌ను రోజూ వాడతారు. మరికొంతమంది లోషన్‌ను అప్లై చేస్తారు. రెండూ ఒకేలా కనిపిస్తున్నా వాటి మధ్య చాలా తేడా ఉంది. మాయిశ్చరైజర్, లోషన్ ఈ రెండూ చర్మంలో తేమను నిర్వహించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. అయితే వాటి ఫార్ములాలో కొంత వ్యత్యాసం ఉంటుంది.

మాయిశ్చరైజర్..

మాయిశ్చరైజర్ అనేది చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన ఉత్పత్తి. ఇది చర్మానికి తేమను అందించి పొడిబారకుండా చేస్తుంది. ఇది క్రీమ్, నీళ్లు, జెల్ రూపంలో వస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఇది స్కిన్ టోన్, ఆకృతిని మెరుగుపరచడంలో, ముడతలను తగ్గించడంలో సహాయకరంగా ఉంటుంది. మాయిశ్చరైజర్ ఎప్పుడూ కూడా మీ చర్మ రకాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవాలి. ఈ రోజుల్లో వివిధ రకాల చర్మాలను బట్టి అనేక మాయిశ్చరైజర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

లోషన్..

లోషన్ అనేది ఒక రకమైన మాయిశ్చరైజర్. ఇది ఎక్కువ నీళ్లు కలిగి ఉంటుంది. క్రీమ్ కంటే తేలికగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేమ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. లోషన్ శరీరానికి రాసినప్పుడు జిడ్డు లేకుండా చర్మంలోకి సులభంగా ఇంకిపోతుంది. బాడీ లోషన్లని ముఖానికి కాకుండా కేవలం శరీరభాగాలకు మాత్రమే రాస్తుంటారు.

తేడా ఏమిటి ?

మాయిశ్చరైజర్ క్రీమ్ కంటే లోషన్‌లో నీటి శాతం ఎక్కువ. అలాగే మాయిశ్చరైజర్‌లో నూనె శాతం లోషన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలో తేమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాదు యాంటీ ఏజింగ్ లేదా మొటిమల నుండి ఉపశమనాన్ని అందించే పదార్థాలు కూడా ఇందులో ఉన్నాయి. శరీరంలోని కొన్ని భాగాలకు లోషన్లు తరచుగా రాస్తూ ఉంటారు.

ఆకృతి గురించి మాట్లాడినట్లయితే లోషన్లు సాధారణంగా తేలికగా ఉంటాయి. లోషన్లు తక్కువ జిడ్డును కలిగి ఉంటాయి. దీని కారణంగా అవి వేసవి కాలంలో కూడా వాడవచ్చును. ఈ లోషన్ సాధారణ నుండి పొడిచర్మం ఉన్నవారికి ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటాయి. మాయిశ్చరైజర్‌లు క్రీమీయర్‌గా ఉంటాయి. లోషన్‌ల కంటే కొంచెం జిగటగా అనిపించవచ్చు. పొడి చర్మానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, చర్మం రకం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అందుకే మీకు ఏది సరైనది అనేది మీ చర్మం రకం పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మాయిశ్చరైజర్లు, లోషన్లు అందుబాటులో ఉన్నాయి. ఏది చర్మం, సీజన్ అవసరాన్ని బట్టి ఉపయోగించాలి.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. 


Similar News