మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే ఏమిటి ? లక్షణాలు ఎలా ఉంటాయి..

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుండె సంబంధిత సమస్యతో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుంది.

Update: 2024-03-31 08:20 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుండె సంబంధిత సమస్యతో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుంది. గుండె సంబంధిత సమస్యలో గుండెపోటు రావడం, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అనే పదాలను మనం వింటూనే ఉంటాం. ఈ రెండూ గుండె పనితీరు పై ప్రభావం చూపిస్తాయి. అలాగే మరో గుండె సంబంధిత సమస్య మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. దాదాపుగా ఈ పేరును చాలా తక్కవ మంది విని ఉంటారు. ఇటీవల కాలంలో మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ ఈ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంతకీ ఈ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే ఏమిటి. ఇది గుండె పనితీరు పై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే ఏమిటి?

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్‌ను MI అని కూడా అంటారని వైద్యులు తెలుపుతున్నారు. ఇది ఒక రకమైన గుండెపోటు మాత్రమే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కేసులు పెరుగుతున్నాయని కార్డియాలజిస్ట్ లు తెలుపుతున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణమైపోతుంది. MI కారణంగా గుండె కండరాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీని కారణంగా రోగికి అనేక సమస్యలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య పెరిగిపోవడంతో గుండె నుంచి రక్తం పంపింగ్ సరిగా జరగక గుండె చుట్టూ ఉండే కండరాలకు ఆక్సిజన్ సరఫరా చేసే పని ఆగిపోతుంది. దీని వల్ల క్రమంగా రోగికి ఛాతీలో నొప్పి మొదలై గుండెపోటు వస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా ఆకస్మిక మరణం కూడా సంభవించవచ్చంటున్నారు. ఇదంతా చాలా తక్కువ సమయంలో జరుగుతుందట. చాలా సందర్భాల్లో రోగి దానిని గుర్తించకపోవడంతో అకస్మాత్తుగా అతనికి గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు.

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లక్షణాలు

1. ఛాతి నొప్పి

2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

3. నిద్రపోవడంలో ఇబ్బంది

4. వాంతులు, వికారం లేదా కడుపులో అసౌకర్యం

5. మైకము లేదా మూర్ఛ వచ్చినట్టు అనిపించడం

గుండెపోటు..

గుండెపోటు సమయంలో గుండె ఒక భాగంలో రక్త సరఫరా ఆగిపోతుంది. లేదా సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండెలోని కొంత భాగం రక్తాన్ని సరిగ్గా పంప్ చేయదు. ఇది జరిగినప్పుడు గుండె పంపింగ్ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఈ పరిస్థితిలో మీ గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహం తగ్గడం లేదా ఆగిపోవడం మొదలవుతుంది. దీని కారణంగా వ్యక్తి మరణిస్తాడు.

గుండెపోటును ఎలా నివారించాలి..

గుండెపోటును నివారించడానికి, మొదట మీరు మీ జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. అప్పుడే మీరు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

1. ఎక్కువ నూనె, కొవ్వు, మాంసం లేని సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇది కాకుండా, మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలను చేర్చుకోవాలి.

2. అతిగా మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు.

3. బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ లెవెల్ తో పాటు మీ కొలెస్ట్రాల్ ను నార్మల్ గా ఉంచుకోవాలి.

4. రోజూ వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఊబకాయం గుండెపోటుకు అతిపెద్ద, ప్రధాన కారణాలలో ఒకటి.

5. ప్రతి ఒక్కరు వారి దినచర్యలో ధ్యానం, యోగా, శ్వాస అభ్యాసాలను చేయడం అలవాటు చేసుకోవాలి.

Tags:    

Similar News