యానిమల్ కేర్ లేదనిపిస్తే ప్రయోగ సంస్థల లైసెన్స్ రద్దు..

ఎథికల్ యానిమల్ రీసెర్చ్ (నైతిక జంతు పరిశోధన)కు మద్దతిచ్చే శాస్త్రవేత్తలు.. వ్యాధికి గల కారణాలు, దానికి చికిత్స ఎలా చేయాలో పరిశోధకులకు సహాయం చేయడం ద్వారా మానవులు, జంతువుల బాధలను తగ్గిస్తారు..

Update: 2023-01-07 04:57 GMT

దిశ, ఫీచర్స్: ఎథికల్ యానిమల్ రీసెర్చ్ (నైతిక జంతు పరిశోధన)కు మద్దతిచ్చే శాస్త్రవేత్తలు.. వ్యాధికి గల కారణాలు, దానికి చికిత్స ఎలా చేయాలో పరిశోధకులకు సహాయం చేయడం ద్వారా మానవులు, జంతువుల బాధలను తగ్గిస్తారు. ఒక ప్రయోగశాలలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్న వ్యక్తుల కోసం బిహేవియరల్ ట్రీట్మెంట్స్, మెడికేషన్‌పై అధ్యయనం చేసే న్యూరో సైంటిస్ట్ .. కుక్కలు, ఎలుకలపై చేసిన పరిశోధన ద్వారా సాధ్యమయ్యే చికిత్సలను కనుగొంటాడు. అక్కడే పరిశోధనా అధ్యయనాలలో ప్రయోగశాల జంతువులను చూసుకునే పశువైద్యుడు.. వాటితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనే విషయాలపై పరిశోధకులకు తగిన శిక్షణ ఇస్తుంటాడు. జంతు పరిశోధన నైతికంగా, మానవీయంగా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడంపై వీరిద్దరూ అధిక ప్రాముఖ్యతనిస్తారు. కానీ వీటిలో 'ఎథికల్ యానిమల్ రీసెర్చ్' మొదటి స్థానంలో పరిగణించబడుతుంది.

జంతు పరిశోధనకు '4 R'

నైతిక జంతు పరిశోధనకు ప్రామాణిక నిర్వచనం లేదు. కానీ దీని అర్థం.. రీసెర్చ్ యానిమల్స్‌ విషయంలో మానవత్వ సంరక్షణ. ఫెడరల్ రీసెర్చ్ ఏజెన్సీలు పరిశోధనలో జంతువుల ఉపయోగం, సంరక్షణపై మార్గదర్శక సూత్రాలను అనుసరిస్తాయి. ఇందులో ఒకటి, పరిశోధన తప్పనిసరిగా జ్ఞానాన్ని పెంచాలి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మానవులు, ఇతర జంతువుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మరొకటి, చెల్లుబాటు అయ్యే ఫలితాలను పొందేందుకు తక్కువ సంఖ్యలో జంతువులను ఉపయోగించాలి. పరిశోధకులు నొప్పి, బాధను తగ్గించి.. జంతువుల సంక్షేమాన్ని పెంచే విధానాలను తప్పనిసరిగా ఉపయోగించాలి. గణిత నమూనాలు లేదా కంప్యూటర్ అనుకరణలు వంటి నాన్ యానిమల్ ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలి.

ఈ సూత్రాలు జంతు పరిశోధన యొక్క "3 R'లు తగ్గింపు(రెడక్షన్), శుద్ధి(రిఫైన్మెంట్), భర్తీ(రీప్లేస్మెంట్)' ద్వారా సంగ్రహించబడ్డాయి. జంతువులను తగిన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడానికి అనుమతించే కొత్త పద్ధతులను అభివృద్ధి చేయమని 3 Rలు శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తాయి. 1960 ప్రారంభంలో మొదటిసారిగా చేర్చబడిన ఈ మార్గదర్శకాలు.. జంతు పరిశోధనను గణనీయంగా తగ్గించడంలో సహాయపడ్డాయి. ఆ తర్వాత 1985 నుంచి పరిశోధనలో జంతువుల సంఖ్య సగానికి తగ్గింది. ఇక నాల్గవ 'R' పునరావాసం(రిహెబిలేషన్).. 1990ల చివరలో అధికారికీకరించబడింది. ఇది రీసెర్చ్‌లో జంతువుల పాత్ర పూర్తయిన తర్వాత వాటి సంరక్షణను సూచిస్తుంది.

నైతికతను అమలు చేయడం

నైతిక జంతు పరిశోధన కోసం నిర్దిష్ట మార్గదర్శకాలు సాధారణంగా జాతీయ ప్రభుత్వాలచే ఏర్పాటు చేయబడతాయి. స్వతంత్ర సంస్థలు కూడా పరిశోధన ప్రమాణాలను అందిస్తాయి. యూఎస్‌లో జంతు సంక్షేమ చట్టం ఎలుకలు, పక్షులు మినహా అన్ని వెచ్చని రక్తపు జంతువులకు రక్షణనిస్తుంది. ఎలుకలు, పక్షులు, చేపలు, సరీసృపాలతోపాటు అన్ని ఇతర సకశేరుకాలు పబ్లిక్ హెల్త్ సర్వీస్ పాలసీ ద్వారా రక్షించబడతాయి.

జంతు పరిశోధనను నిర్వహించే ప్రతి సంస్థకు ఇన్‌స్టిట్యూషనల్ యానిమల్ కేర్ అండ్ యూజ్ కమిటీ( IACUC) అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ముందు జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు నిర్ధారించడానికి IACUC సదరు సంస్థల పరిశోధన ప్రోటోకాల్‌లను సమీక్షిస్తుంది. నైతిక పరిశోధన పద్ధతులు, జంతు సంరక్షణను నిరంతరం అమలు చేయడానికి ఆమోదం పొందిన తర్వాత అధ్యయనాలను కూడా పర్యవేక్షిస్తుంది. U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అక్రిడిటేషన్ ఏజెన్సీలు, ఫండింగ్ ఎంటిటీలతో కలిసి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తుంది. ప్రమాణాలను ఉల్లంఘించే ప్రయోగశాలలకు జరిమానా విధించి... అవసరమైతే ఆ అధ్యయనాలను మధ్యలోనే నిలిపేస్తుంది. పరిశోధన నిధుల నుంచి మినహాయిస్తూ.. లైసెన్స్‌ సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. దుష్ప్రవర్తన ఆరోపణలపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ కార్యాలయం కూడా దర్యాప్తు చేస్తుంది. ఇక U.S.తో సహా 47 దేశాలలోని పరిశోధనా సంస్థలు అసోసియేషన్ ఫర్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ లాబొరేటరీ యానిమల్ కేర్ (AAALAC) అనే లాభాపేక్షలేని సంస్థ ద్వారా స్వచ్ఛంద గుర్తింపు పొందవచ్చు. AAALAC అక్రిడిటేషన్ జంతు సంరక్షణ, ఉపయోగాల యొక్క అధిక ప్రమాణాల నిర్వహణను గుర్తిస్తుంది.

ఆచరణలో సూత్రాలు

మొదట శాస్త్రవేత్తలు తమ పరిశోధన యొక్క ఉద్దేశ్యాన్ని వివరించే ప్రోటోకాల్‌లను రూపొందించాలి. కంప్యూటర్ మోడల్స్, సెల్ కల్చర్స్‌తో పరిశోధన ఫలితాలు సాధ్యం కానప్పుడు.. జంతువులు ఎందుకు అవసరమో వివరించాలి. నిరంతర అధ్యయన పర్యవేక్షణ సమయంలో జంతువులకు వాటి జాతుల ప్రవర్తన, సామాజిక అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గృహాలను అందించారా లేదా అని ఇన్‌స్పెక్టర్స్ పరిశీలిస్తారు. ఎందుకంటే జంతువులకు పర్యావరణ ఉద్దీపన లేనప్పుడు, వాటి మెదడు పనితీరును మార్చగలదు. ఆ పరిస్థితి జంతువుకు మాత్రమే కాకుండా పరిశోధనకు కూడా హాని కలిగిస్తుంది. అందుకే పర్యవేక్షణ ఏజెన్సీలు జంతువుల బాధలను కూడా పరిగణిస్తాయి. మనుష్యులలో బాధాకరమైనది జంతువులలో కూడా బాధాకరమైనదిగా భావించబడుతుంది. అందుకే జంతువులు క్షణికావేశం కంటే ఎక్కువ లేదా కొంచెం నొప్పిని అనుభవించినప్పుడు మత్తుమందు, నొప్పి నివారణ మందులు లేదా అనస్థీషియా తప్పక అందించాలి.

మానవులతో పాటు జంతువులకు ప్రయోజనం

జంతు పరిశోధన మానవులతో పాటు జంతువులకు ప్రయోజనం చేకూరుస్తుంది. క్యాన్సర్ మరియు న్యూరోడెజెనరేటివ్ వ్యాధికి చికిత్సల నుంచి శస్త్రచికిత్స, అవయవ మార్పిడి, నాన్‌ఇన్వాసివ్ ఇమేజింగ్, డయాగ్నస్టిక్స్ కోసం కొత్త పద్ధతుల వరకు వాటిని మొదట్లో జంతువులలో అధ్యయనం చేసినందున అనేక వైద్యపరమైన పురోగతులు ఉన్నాయి. ఈ పురోగతులు జూ యానిమల్స్, వన్యప్రాణులు, అంతరించిపోతున్న జాతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. జంతు పరిశోధన పశువులలో కొన్ని వ్యాధుల నిర్మూలనకు అనుమతించింది. క్యాన్సర్ చికిత్సలు, సమర్థవంతమైన వ్యాక్సిన్‌లు, పోషకాహార ప్రిస్క్రిప్షన్ డైట్‌లు, ఫ్లీ అండ్ టిక్ ట్రీట్‌మెంట్స్ అందుబాటులోకి తీసుకురాగలిగారు.


Similar News