మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చా.. ?

ఎవరికైనా మధుమేహం వస్తే దాని బారి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు.

Update: 2024-01-22 15:22 GMT

దిశ, ఫీచర్స్ : ఎవరికైనా మధుమేహం వస్తే దాని బారి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. షుగర్ వ్యాధి సంభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జీవనశైలి. బిజీ లైఫ్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడికి లోనవడం వంటి కారణాలతో మధుమేహం బారిన పడతారు. అయితే ఈ షుగర్ వ్యాధిని చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తారు. మధుమేహం బారిన పడ్డామని 90 శాతం మందికి ముందుగా అస్సలు తెలియదు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో నారింజ వంటి పండ్ల రసాలను తాగాలా వద్దా అనే గందరగోళం షుగర్ పేషెంట్లలో ఉంటుంది. మరి నిపుణుల ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నారింజ పండ్ల ప్రయోజనాలు..

మామిడి పండ్లు తినాలంటే వేసవికాలం కోసం ఎదురుచూసినట్లే, ఆరెంజ్ ప్రేమికులు శీతాకాలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నారింజలో మన శరీరానికి కావలసిన విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి చర్మాన్ని, జుట్టుకు ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికాలంలో నారింజ పండ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తినాలా వద్దా అనే విషయానికొస్తే చలికాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిది కాందంటున్నారు ఎండోక్రినాలజిస్ట్ లు.

ఈ జ్యూస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి హాని కలగదు. దీని కారణంగా, చక్కెర స్థాయి పెరగదు, అయినా డాక్టర్ సలహా పై మాత్రమే జ్యూస్ తాగాలని చెబుతున్నారు. పండ్ల రసం తాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి మరింత దిగజారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తాగే బదులు నేరుగా తింటే చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నేరుగా తినడం వల్ల ఫైబర్ అందుతుంది, పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

అంతే కాదు నారింజను నేరుగా తింటే పీచు పదార్థాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సరైన మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వలన జీవక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గడంలోనూ సహాయపడుతుందట. అందుకే ఆరెంజ్ వంటి పండ్లను జ్యూస్‌గా కాకుండా నేరుగా తింటే మేలు జరుగుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News