Vitamin D : అత్యధిక మందిలో విటమిన్ డి లోపం..! కారణం ఇదే..
Vitamin D : అత్యధిక మందిలో విటమిన్ డి లోపం..! కారణం ఇదే..
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండటంలో పోషకాహారం, ఫిజికల్ యాక్టివిటీస్, ప్రకృతిలో గడపడం వంటివి కీ రోల్ పోషిస్తాయి. ఇవి లేకపోతే పలు అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా విటమిన్ల లోపంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వాటిలో విటమిన్ డి లోపం కూడా ఒకటి. భారత యువతలో, పెద్దల్లో ఇదొక సమస్యగా మారుతోందని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రజలు విటమిన్ డి లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
50 ఏండ్లు పైబడిన వారిలో..
ఉత్తర భారత దేశంలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. ఇక్కడ 50 ఏండ్లు పైబడిన పెద్దల్లో విటమిన్ డి లోపం 91.2 శాతంగా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన పలు కమ్యూనిటీ ఆధారిత అధ్యయనాలు కూడా ప్రజల్లో 50 నుంచి 94 శాతం వరకు విటమిన్ డి లోపం ఉన్నట్లు వెల్లడించాయి. 2023లో కూడా ఆన్‌లైన్ ఫార్మసీ అయినటువంటి టాటా 1 ఎంజీ ల్యాబ్స్ సర్వే ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఒకరు అంటే.. జనాభాలో 76 శాతం విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇక 25 ఏళ్లలోపు యువతలో విటమిన్ డి లోపం 84 శాతం ఎక్కువగా ఉంది. అలాగే 25 నుంచి 40 ఏండ్ల వయసులో ఈ రేటు 81 శాతంకంటే తక్కువగా ఉంది.
కారణాలు
విటమిన్ డి లోపానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి అవుట్ డోర్ యాక్టివిటీస్ లేకపోవడమే. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజలు ఎక్కువ సమయం ఇండ్లల్లోనే గడపం కారణంగా వారు ఉదయపు వేళలో సూర్యరశ్మికి గురికావడం లేదు. దీంతో విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. దీంతోపాటు వాయు కాలుష్యం, అధిక ధూళి సాంద్రతలు వంటివి మిటమిన్ డి లోపానికి దారితీస్తున్నాయి.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.