ఈ రాశుల వారికి అతీంద్రియ శక్తులు.. అందుకే వాళ్లు దెయ్యాలను చూడగలరట..
కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తమకు దయ్యాలు, గాలి, ఆత్మలు కనిపించాయని చెబుతుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తమకు దయ్యాలు, గాలి, ఆత్మలు కనిపించాయని చెబుతుంటారు. మరికొందరైతే వారు ఆత్మలతో మాట్లాడతాం అని చెబుతారు. అయితే వారికి నిజంగానే ఆత్మలు, దయ్యాలు కనిపిస్తాయా అన్న అనుమానాలు ఎదుటి వారిలో వస్తుంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ఆ శక్తి ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఓ మనిషి పుట్టిన తిథి, రాశి, నక్షత్రాన్ని బట్టి వారికి అది సాధ్యం అని చెబుతున్నారు. కొన్ని రాశులలో, తిథులలో పుట్టిన వారికి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏంటి, వారికి ఎలాంటి శక్తులు ఉంటాయన్న విషయాలను ఇఫ్పుడు మనం తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం మనకు 12 రాశులు ఉంటాయి. ఒక్కో రాశి వారికి ఒక్కో స్వభావం ఉంటుంది. కొంతమంది అతిగా మాట్లాడితే, కొంతమంది అస్సలు మాట్లాడరు, కొంతమంది అతిగా పనులు చేస్తే, మరికొంతమంది బద్దకంగా ఉంటారు. ఇలా అనేక స్వభావాలతో ఉంటారు. ఇక మరి కొంతమంది మౌనంగా ఉండి, ప్రపంచంతో మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండి, ఎప్పుడూ దిక్కుల వైపున చూస్తూ ఉంటారు. దానికి కారణం వారిలో ఉండే అతీంద్రియ శక్తులే అంటారు పండితులు. అంతే కాదు వారు ప్రత్యేక పద్దతిలో, ప్రత్యేకమైన వస్తువులను భద్రపరుచుకుంటుంటారట. అలాగే ఎవరూ కనిపెట్టలేని విషయాలను వీరు కనిపెడతారట, ఎవరూ గుర్తించని కొన్నిటిని వీరు గుర్తిస్తారట. ఇలాంటి లక్షనాలున్న రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి : ఈ రాశి వారికి అధిపతిగా బుధ గ్రహం ఉంటుంది. ఈ గ్రహాన్ని సమాచార గ్రహం అంటారు. ఈ రాశి వారు గ్రహాంతర శక్తులు, దయ్యాలు, అపరిచితుల నుంచి రహస్యాలను వినేందుకు ఉత్సాహం చూపిస్తారట. వీరికి నిద్రలో కనిపించే కలలు స్పష్టంగా ఉంటాయట. అంతే కాదు ఎవరైనా ఏదైనా విషయం గురించి భయపడితే అలాంటి విషయాలను గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారంటున్నారు పండితులు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఎక్కువగా పునర్జన్మ, ఆత్మ, మరణం వంటి విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారట. ఈ రాశిలో పుట్టిన వారికి జల శక్తి ఉంటుందంటున్నారు పండితులు. అలాగే వీరికి అంతర దృష్టి కూడా ఉంటుందంటున్నారు. ఈ రాశిగల వారు దయ్యాలను కూడా చూడగలుగుతారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
మీన రాశి : ఈ రాశి గల వారిని వరుణ గ్రహం అని అంటారని పండితులు చెబుతున్నారు. మానసిక శిథిలాలు, ఆత్మల శక్తులు లాంటి వాటి పై వీరు ఎక్కువగా ఆకర్షితులవుతారట. అంతే కాదు ఈ రాశి వారు అవలీలగా దయ్యాలను, ఆత్మలను చూడగలరని, మాట్లాడగలరని చెబుతున్నారు. ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉంటాయంటున్నారు పండితులు.
గమనిక : * గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. జ్యోతిష్యం, జ్యోతిష్యపండితుల నుంచి సలహా తీసుకోవాలి.