HIV భయం, భయం.. రాత్రి పూట ఇలా జరిగితే వ్యాధి ఉన్నట్లేనంట!

త్రిపుర రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఐవీ విసృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని కారణంగా 47 మంది విద్యార్థులు మరణించగా,828 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు.

Update: 2024-07-11 11:25 GMT

దిశ, ఫీచర్స్ : త్రిపుర రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఐవీ విసృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని కారణంగా 47 మంది విద్యార్థులు మరణించగా,828 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు. కాగా అసలు హెచ్ఐవీ అంటే ఏంటీ దీని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిడ్స్ ఇదొక అంటు వ్యాధి. దీనిని త్వరగా గుర్తించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు ఆరోగ్యనిపుణులు కాగా, దీని లక్షణాలు ఎలా ఉంటాయంట?

హెచ్ఐవీ మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయంట. రెండో దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. మూడో దశలో వ్యక్తిలో రోగనిరోధక శక్తి మొత్తం తగ్గిపోయి, ప్రాణాలు కూడా పోయే ప్రమాదంఉంటుందంట.

కాగా, మొదటి దశలో కనిపించే లక్షణాలు ఏవి అంటే?

1. అలసట, నీరసం

2. తలనొప్పి, గొంతు నొప్పి

3. నోటి పూతలు

4. వాంతులు విరేచనాలు

5. రాత్రిపూట చెమటలు రావడం, ఈ స్ట్ ఇన్ఫెక్షన్స్


Similar News