రాత్రి సమయంలో స్నానం చేస్తే ఇన్ని లాభాలా?
రాత్రి సమయంలో స్నానం చేయడం వలన శరీరానికి,మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మనం ఉదయం నుంచి ఎండ, వేడి, చెమటల కారణంగా కలిగే ఇబ్బందులు కూడా ఒక్క స్నానంతో దూరం అవుతుంది.
దిశ,ఫీచర్స్: రాత్రి సమయంలో స్నానం చేయడం వలన శరీరానికి,మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మనం ఉదయం నుంచి ఎండ, వేడి, చెమటల కారణంగా కలిగే ఇబ్బందులు కూడా ఒక్క స్నానంతో దూరం అవుతుంది.
అయితే రాత్రి సమయంలో స్నానం చేస్తే ఫలితాలు ఎలా ఉంటుంది. అసలు రాత్రి పూట స్నానం చేయవచ్చా అనే విషయాలను మనకు ఆలోచనలలో వస్తూ ఉంటుంది. మరి దాని వలన కలిగే లాభ నష్టాలను ఇక్కడ తెలుసుకుందాం..
నష్టాలు:
అసలు రాత్రి భోజనం తర్వాత తలస్నానం చేయకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే సులభంగా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే రాత్రి సమయంలో తలస్నానం చేసిన తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి అత్యవసరంగా చేయాల్సి వస్తే గోరు వెచ్చని నీటితో చేయడం వల్ల జలుబు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అదే విధంగా భోజనం తర్వాత స్నానం చేసే వారికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు
లాభాలు:
రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం కావడమే కాకుండా చర్మ సంరక్షణ గా ఉండేలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎక్కువ సమయం పాటు శరీరం మీద ఉదయం నుంచి మురికి దుమ్ము, ధూళి వంటివి చికాకు కలుగుతూ ఉంటే రాత్రిపూట వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చక్కని నిద్ర పట్టేలా చేస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాడీలో హీట్ పోయి మెదడును ప్రశాంతంగా చేసి మంచి నిద్రకు దారితీస్తుంది. నిర్జీవంగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది
Read More..
అందమైన పచ్చలహారం.. చూడగానే పడిపోతున్న అమ్మాయిలు.. ట్రెండ్ సెట్టర్ ఎవరో తెలుసా?