మెదడులో కొత్త భాగం..

బ్రెయిన్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్‌లో భాగమైన కొత్త అనటామికల్ స్ట్రక్చర్‌‌ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు..

Update: 2023-01-07 05:53 GMT

దిశ, ఫీచర్స్: బ్రెయిన్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్‌లో భాగమైన కొత్త అనటామికల్ స్ట్రక్చర్‌‌ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కణజాలం అనేది మెదడును కప్పి ఉంచే ఒక సన్నని పొర. ఇది మెదడులోపల సర్క్యులేట్ అయ్యే కొత్తగా తయారు చేయబడిన సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని కలిగి ఉంటుంది. కణాల వ్యర్థ ఉత్పత్తులను కలిగి ఉన్న మురికి ద్రవం నుంచి వేరుగా ఉంటుంది.

అయితే పుర్రెకు, మెదడుకు మధ్య మూడు పొరలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త నిర్మాణమైన నాల్గవ పొర.. లోపలి పొర పైన ఉంటుంది. దీనిని సబ్‌అరాక్నోయిడ్ లింఫటిక్ లైక్ మెంబ్రేన్ (SLYM) అని పిలుస్తారు. ఇది చాలా సన్నగా.. కేవలం కొన్ని కణాల వెడల్పుతో లేదా ఒక సెల్‌ వెడల్పుతో కూడా ఉంటుంది.

అయితే ఈ నిర్మాణాన్ని కనుగొనడంలో సహాయపడిన న్యూయార్క్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన మైకెన్ నెదర్‌గార్డ్..

SLYM ఇంతకు ముందు గుర్తించబడకపోవడానికి కారణాన్ని వివరించాడు. పోస్ట్‌మార్టంలో పుర్రె నుంచి మెదడును తొలగించినప్పుడు ఈ పొర విచ్ఛిన్నమవుతుందని, అందుకే గతంలో గుర్తించలేకపోయామని తెలిపాడు. జీవించి ఉన్న వ్యక్తుల్లోనూ ఈ పొర చాలా సన్నగా ఉంటుందని, బ్రెయిన్-స్కానింగ్ మెషిన్స్ ద్వారా చూడొచ్చని చెప్పాడు. కాగా ఈ కణజాలం ముందు ఎలుకల్లో కనుగొనబడగా.. ఇందుకోసం నెదర్‌గార్డ్స్ టీమ్ జెనెటిక్ లేబలింగ్ టెక్నిక్‌ను ఉపయోగించింది టీమ్. ఈ పద్ధతి SLYM కణాలను ఫ్లోరోసెంట్‌ గ్రీన్‌గా మెరిపించగలదు. ఇక SLYM రోగనిరోధక కణాలను కూడా కలిగి ఉంటుందని, ఇది సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ సంకేతాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. 

Also Read..

యానిమల్ కేర్ లేదనిపిస్తే ప్రయోగ సంస్థల లైసెన్స్ రద్దు.. 

Tags:    

Similar News