Weekend Exercises : వారానికి ఒక్కసారైనా.. ఈ పని చేస్తే బెటర్!
Weekend Exercises : వారానికి ఒక్కసారైనా ఈ పని చేస్తే బెటర్!
దిశ, ఫీచర్స్ : వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే వింటర్‌లో చల్లటి వెదర్ కారణంగానో, సమయం లేకనో కొందరు ఈ సీజన్ మొత్తం వాటిని అవైడ్ చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. రోజూ ఎక్సర్ సైజ్‌లు చేస్తే మంచిది. ఒకవేళ అలా వీలుకాకపోతే వారంలో ఒక్కసారి చేసినా చక్కటి ఫలితాన్నిస్తుంది అంటున్నారు నిపుణులు. రీసెంట్‌గా మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకుల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. వీకెండ్ ఎక్స్‌సైజ్‌లు కూడా రెగ్యులర్ వ్యాయామాల మాదిరి బెనిఫిట్స్ కలిగిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు రెగ్యులర్ వ్యాయామాలు, వారానికి ఒకసారి వ్యాయామాల ప్రయోజనాలను పరిశీలించారు. అందుకోసం పలువురిని చేతికి యాక్సిలరో మీటర్లతో కూడిన పరికరాలను ధరించాలని సూచించారు. ఇలా దాదాపు 90 వేల మంది వివరాలను నమోదు చేసి, ఎనలైజ్ చేశారు. అయితే ఇందులో వీకెండ్ వ్యాయామాలు చేసేవారిని కూడా గ్రూపులుగా విభిజించారు. వారినికి 150 నిమిషాలకన్నా తక్కువ శ్రమ కలిగి ఉండేవారిని అంతగా ఎక్సర్ సైజ్‌లు చేయనివారి జాబితాలో చేర్చారు. కాగా వీరందరిలోనూ నాడీ సంబంధిత సమస్యలతో పాటు, మానసిక, జీర్ణకోశ సమస్యలను కూడా విశ్లేషించారు.
అయితే అంతగా వ్యాయామం చేయని వారితో పోలిస్తే రోజూ వ్యాయామాలు చేసేవారితోపాటు వారాంతాల్లో చేసేవారు కూడా ఇక్కడ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. వీరిలో దాదాపు రెండు వందలకు పైగా జబ్బుల రిస్క్ తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ వంటివి ఇందులో ఉన్నాయి. కాగా వారాంతాల్లో మాత్రమే వ్యాయామాలు చేయాలని పరిశోధకుల ఉద్దేశం కాదిక్కడ. పూర్తిగా చేయనివారితో పోలిస్తే వీకెండ్స్‌లో చేసేవారు కూడా ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారనేది అధ్యయనంలో తేలింది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రభావాన్ని తగ్గించడంలో, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడంలో వీకెండ్ ఎక్సర్ సైజ్‌లు కూడా సహాయపడతాయి. కాబట్టి సమయం, అవకాశం లేని యువత, పెద్దలు ఎవరైనా సరే కనీసం వీకెండ్ వ్యాయామాలనైనా ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం.