కొత్త పెళ్లి జంటలకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైన కొత్తగా పెళ్లైన జంటకు వివిధ వస్తువులు బహుమతిగా ఇస్తారు. కానీ ఇక్కడ ఓ వింత సంఘటన జరిగింది.

Update: 2022-08-14 02:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైన కొత్తగా పెళ్లైన జంటకు వివిధ వస్తువులు బహుమతిగా ఇస్తారు. కానీ ఇక్కడ ఓ వింత సంఘటన జరిగింది. వెడ్డింగ్ కిట్ పెరుతో నూతన దంపతులకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఇస్తున్నారు. అవును మీరు చదివింది నిజమే.. ఒడిశా ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ విధంగా వెడ్డింగ్ కిట్ల పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వం ద్వారా పంచబడే ఈ కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు, ఇతర వస్తువులతోపాటు కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రయోజనాలపై బుక్‌లెట్ ఉంటాయి. "ఇది.. జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క 'నై పహల్ పథకం'లో భాగం," అని ఆ రాష్ట్ర ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ బిజయ్ పాణిగ్రాహి అన్నారు.


Similar News